Movie News

నగరానికి ఇంత క్రేజ్ ఉందేంటి

ఎప్పడికప్పుడు రీ రిలీజుల ట్రెండ్ అయిపోతుందనుకుంటున్న టైంలో ఏదో ఒక సినిమా మళ్ళీ దానికి ఊపిరి పోస్తోంది. 29న ఈ నగరానికి ఏమైంది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం మరోసారి అర్థమైపోతుంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల దాకా అధిక శాతం షోలు ముందస్తుగానే ఫుల్ అయిపోతున్నాయి. నిజానికి ట్రేడ్ సైతం ఇది ఊహించలేదు. అయిదో వార్షికోత్సవం సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ దీనికి పరిమిత విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ థియేటర్లను మాట్లాడుకుంది. తీరా చూస్తే డిమాండ్ కు తగ్గట్టు ఇప్పుడా కౌంట్ పెంచక తప్పేలా లేదు.

దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ట్రెండ్ చూసి షాక్ అవుతున్నాడు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సీట్లు బ్లాక్ చేశారని అనుకుంటున్నారని, కానీ ఆడియన్స్ స్వయంగా ఆ పని చేయడంతో తనకు నోట మాట రావడం లేదని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఈ రేంజ్ లో అప్పుడే చూసి ఉంటే ఈపాటికి గోవాలో ఇల్లు కట్టుకునే వాడినని సెటైర్ వేసుకున్నారు. ఎందుకంటే ఒరిజినల్ రిలీజ్ టైంలో ఈ నగరానికి ఏమైందికి యూత్ మద్దతు ఎంత దక్కినా కమర్షియల్ లెక్కల్లో మరీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. తక్కువ బడ్జెట్ కావడం వల్ల గట్టెక్కింది కానీ అదిరిపోయే హిట్ అయితే కాదు

ఏళ్ళు గడిచే కొద్దీ దీనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. కల్ట్ స్టేటస్ వచ్చేసింది. కుర్రాళ్ళ జీవితాల్లో అచ్చం ఎలా ప్రవర్తిస్తారో దాన్నే తరుణ్ భాస్కర్ ఆవిష్కరించడంతో ఫాలోయింగ్ వచ్చేసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటంలకు మొదటి బ్రేక్ ఇదే. మరుసటి రోజు వస్తున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు ధీటుగా బుకింగ్స్ జరుగుతున్న ఈ నగరానికి ఏమైంది చూస్తుంటే సైలెంట్ కిల్లర్ లాగా రికార్డులు కొట్టేలా ఉంది. తరుణ్ కొత్త మూవీ కీడా కోలా టీజర్ కూడా ఇందులోనే ప్లే చేయబోతున్నారు. ఆన్ లైన్ వెర్షన్ లేట్ గా ఉంటుందని అందుకే ఇదో స్పెషల్ బోనస్ కింద ఇస్తున్నారు 

This post was last modified on June 27, 2023 11:21 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

5 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

5 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

6 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

8 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

8 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

8 hours ago