పేరుకు కన్నడ అమ్మాయే కానీ ప్రియమణి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. కన్నడ, తమిళం, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ నటించినా.. ఆమె స్టార్ స్టేటస్ అనుభవించింది టాలీవుడ్లోనే. హీరోయిన్‌గా కెరీర్ ముగిశాక ఇప్పుడు ఆమె క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ వైపు మళ్లింది. ఇటీవలే కస్టడీ సినిమాలో విలన్ పాత్రతో ఆకట్టుకున్న ప్రియమణి.. సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజాగా మాట్లాడింది.
బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్త కాదని.. ఐతే తాను ప్రేమించిన ముస్తఫాను పెళ్లాడినపుడు మాత్రం తీవ్రమైన వ్యతిరేకతే ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తాను ముందుకు సాగిపోయినట్లు వెల్లడించింది. ఆన్ లైన్ ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, నా ఒంటి రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నా. ఐతే ఇవన్నీ పక్కన పెడితే ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాను.
మా ఎంగేజ్మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టినపుడు.. నువ్వు ఓ ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటూ అభ్యంతరకరంగా దూషించారు. అలాంటి కామెంట్లు చేసేవాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా జీవితం. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్నది పూర్తిగా నా ఇష్టం. ట్రోల్స్‌కు అవసరం లేని అటెన్షన్ ఇచ్చి వాటి వల్ల బాధ పడటం నాకిష్టం ఉండదు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోను అని ప్రియమణి చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న జవాన్‌లో కీలక పాత్రను పోషిస్తోంది. దక్షిణాదిన కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 27, 2023 9:48 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…