ఇండియన్ సినిమాలో మల్టీవర్స్ అనే మాటను బాగా పాపులర్ చేసింది లోకేష్ కనకరాజే. మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఇప్పటిదాకా ఈ తమిళ దర్శకుడు తీసిన సినిమాల్లో ప్రతిదానికీ ఇంకో సినిమాతో లింక్ కనిపిస్తుంది. ఈ సినిమాలన్నింట్లోనూ డ్రగ్ మాఫియా చుట్టూనే కథలు తిరుగుతాయి. ఒక సినిమాలోని పాత్రలు ఇంకో సినిమాలో పరోక్షంగా తమ ప్రాధాన్యాన్ని చాటుకుంటూ ఉంటాయి.
ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమాతో ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’ (ఎల్‌సీయూ) అనే మాట బాగా పాపులర్ అయింది. ఈ మల్టీవర్స్ ట్రెండ్‌ను వేరే దర్శకులు కూడా అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘పఠాన్’లో సైతం ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ చూడొచ్చు. యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు కూడా ఇలాగే స్పై యూనివర్శ్ అని పెట్టి పాత్రలు.. కథలను మిక్స్ చేస్తున్నారు. లోకేష్ విషయానికి వస్తే ‘లియో’లో సైతం తన ఎల్సీయూను అతను కంటిన్యూ చేస్తున్నట్లే కనిపిస్తోంది.
ఈ సినిమా సైతం డ్రగ్ మాఫియా చుట్టూనే తిరగబోతోందని ‘నా రెడీ’ పేరుతో రిలీజ్ చేసిన పాట చూస్తే అర్థమవుతుంది. ఒక పెద్ద డ్రగ్ మాఫియాకు చెందిన డెన్‌లో ఈ పాట సాగేట్లు చూపించారు. ‘విక్రమ్’ సినిమాలో ఒక సీన్లో కనిపించే ‘దాస్ అండ్ కో’ లోగోను ఈ పాటలో ఒక చోట చూపించారు. అంతే కాక లోకేష్ ప్రతి సినిమాలోనూ చూపించే బిరియాని సీన్ ఈ పాటలోనూ కనిపించింది.
లోకేష్ మార్కు రౌడీలు.. వాళ్ల గెటప్‌లు.. అతడి సినిమాల్లో ఎప్పుడూ కనిపించే కలర్ ఫ్రేమ్స్.. ఇవన్నీ ఈ పాటలో ఉన్నాయి. ఈ పాట చూసి లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ పట్ల అమితాసక్తితో ఉన్న ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాతో ఎల్‌సీయూను ఇంకో స్థాయికి తీసుకెళ్తాడని.. ఇండియన్ సినిమాల్లో దీన్నొక బ్రాండుగా మారుస్తాడని అంచనా వేస్తున్నారు. లియో దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 26, 2023 10:40 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…