చూస్తుండగానే ఓజి షూటింగ్ యాభై శాతం పూర్తయిపోయింది. ఇవాళ టీమ్ అధికారికరంగా యూనిట్ సభ్యులతో కూడిన ఒక ఫోటోని పోస్ట్ చేసి మరీ ప్రకటించింది. నిన్నా మొన్నా స్టార్ట్ అయినట్టుగా ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇంత వేగంగా పూర్తి చేయడంలో స్క్రిప్ట్ పట్ల దర్శకుడు సుజిత్ కున్న క్లారిటీతో పాటు హీరో పవన్ కళ్యాణ్ సహకారం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒకవేళ మిస్ అయినా జనవరిలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్రాజెక్ట్ కె రాక కన్ఫర్మ్ అయ్యాక నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇదంతా బాగానే ఉంది ఈ ఓజి వేగం వీరమల్లుకి గాయంగా మారింది. చాలా నెలల నుంచి కనీస అప్డేట్స్ రావడం లేదు. దర్శకుడు క్రిష్ బయట కనిపించడం మానేశారు. ఎక్కడైనా వేరే సినిమా వేడుకల్లో కనిపిస్తే అడుగుదామంటే ఆ అవకాశమే దొరికితేగా. నిర్మాత ఏఎం రత్నం అడపాదడపా దర్శనమిస్తున్నా మీడియాతో మాత్రం నో ఛాట్. హైదరాబాద్ లో వేసిన సెట్లు తీసేసి గుంటూరు లేదా విజయవాడ పరిసరాల్లో వాటినే తిరిగి వేయించి పూర్తి చేసేలా క్రిష్ ని పురమాయించారని ఇన్ సైడ్ టాక్. జనసేన వారాహి యాత్ర కోసం ఈ సర్దుబాటు తప్పలేదని వినికిడి.
సరే ఎప్పుడు పూర్తి చేసినా విడుదల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఓజి పూర్తయ్యాక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్లు ఇస్తారు. మధ్యలో వీరమల్లుకు కొన్ని కాల్ షీట్స్ ఇవ్వొచ్చు. షూట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ డిమాండ్ చేసే ప్రాజెక్టు కావడంతో క్రిష్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. 2024 దసరా లేదా దీపావళి కన్నా ముందు రిలీజ్ చేసే సూచనలు తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎలక్షన్ల హడావిడిలో పవన్ దొరకడం కష్టం కాబట్టి ఏదున్నా ఆ లోగానే గుమ్మడికాయ కొట్టేయాలి. బ్రో విడుదలయ్యాక ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి
This post was last modified on June 26, 2023 2:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…