ఈ గురువారం విడుదల కాబోతున్న స్పై ప్రమోషన్ల కోసం నిఖిల్ మాములు పరుగులు పెట్టడం లేదు. చాలా తక్కువ టైం ఉండటంతో వీలైనంత మీడియా ఎక్స్ పోజర్ ఉండేలా చూసుకుంటున్నాడు. మొన్న ముంబైలో ట్రైలర్ లాంచ్ పూర్తి చేసి ఇవాళ బెంగళూరు కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నాడు. రేపు చిరంజీవి ముఖ్యఅతిథిగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాదాపు అన్నీ కవర్ చేసినట్టు అవుతుంది. మరో రోజు చెన్నై వెళ్లే ఆలోచన జరుగుతోంది. కేరళ కవర్ చేసేది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. ఈలోగా టికెట్ రేట్లకు సంబంధించిన నిర్ణయాలు జరిగిపోయాయి.
తెలంగాణ వరకు ప్రభుత్వం అనుమతించిన గరిష్ట ధర మల్టీప్లెక్స్ 295 రూపాయలు, సింగల్ స్క్రీన్ 175 రూపాయలకు లాక్ చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రెగ్యులర్ రేట్లతో వెళ్తున్నారు. ఒకవేళ పెంపు కావాలన్నా ప్రత్యేక అనుమతులు, నిబంధనలు ఉన్నాయి కనక వాటిని మీట్ కావడం జరిగే పని కాదు. అందుకే ఏపీ మల్టీప్లెక్స్ 177, సింగల్ థియేటర్ 145 లేదా 112తో అమ్మకాలు చేస్తారు. నైజామ్ వరకు చూసుకుంటే స్పై చేసింది మాత్రం రిస్కే. కంటెంట్ బాగుండొచ్చు కానీ సగటు మధ్యతరగతి జనాలకు అందుబాటులో ఉంటే ఎక్కువ ఆక్యుపెన్సీలు చూడవచ్చు
గతంలో మేజర్, విక్రమ్ లకు పెంపుకు వెళ్లకుండా నిర్మాతలు రెగ్యులర్ రేట్లతో వెళ్లడం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ప్రత్యేకంగా దీని గురించి పబ్లిసిటీలో హైలైట్ చేసుకోవడం జనాన్ని ఆకట్టుకుంది. అదే స్ట్రాటజీని స్పైకి ఫాలో అయ్యుంటే బాగుండేదని సగటు మూవీ లవర్స్ అభిప్రాయం. గ్యారీ దర్శకత్వం వహించిన స్పైకి తెలుగు ఓపెనింగ్స్ కీలకం కానున్నాయి. హిందీలో సత్యప్రేమ్ కి కహాని పోటీ చాలా బలంగా ఉంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ సైతం సవాల్ విసురుతోంది. ఇక్కడ శ్రీవిష్ణు సామజవరగమన తప్ప కాంపిటీషన్ లేదు కనక పాజిటివ్ టాక్ రావడం కీలకం
This post was last modified on June 26, 2023 3:41 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…