ఈ మధ్య తెరమీద కనిపించడం తగ్గించేశారు కానీ గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి డిమాండ్ మాములుగా ఉండేది కాదు. అందంగా కనిపించే అక్క, వదిన పాత్రలకు తనే బెస్ట్ ఛాయస్ గా అనిపించేది. గత మూడు నాలుగు రోజులుగా తీవ్ర సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో టీవీ సెలబ్రిటీలతో పాటు ఈవిడ పేరుని కూడా కొన్ని మీడియా సంస్థలు హైలైట్ చేయడం పట్ల సురేఖావాణి స్పందించారు. అనవసరంగా సంబంధం లేని వివాదాల్లోకి లాగడం వల్ల తమతో పాటు పిల్లల భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపుతుందని ఆవేదన చెందారు
తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ సురేఖావాణి చేసిన విన్నపం వీడియో రూపంలో విడుదల చేశారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ మొత్తాన్ని ఊపేసిన డ్రగ్స్ భాగోతంలో ఎవరూ దోషులుగా తేలనప్పటికీ కొన్ని నెలల పాటు విచారణకు హాజరైన సెలబ్రిటీలు ఇంటా బయటా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ స్కామ్ లో ప్రమేయం ఉన్నట్టు రుజువు కాకపోవడంతో మళ్ళీ ఆ ఇష్యూ తెరపైకి రాలేదు. మళ్ళీ ఇంత కాలం తర్వాత తిరిగి ప్రచారంలోకి రావడంతో ఇంకోసారి లేనిపోని తలనెప్పులు ఎదురుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందినవాళ్ళు లేకపోలేదు.
ప్రస్తుతానికి సురేఖావాణి మాత్రమే స్పందించారు తప్ప ఇంకా బయటికి వచ్చిన పలువురు పేర్లు మౌనంగానే ఉన్నారు. నిన్న నిఖిల్ ఒక అవగాహన సదస్సులో తనకూ గతంలో డ్రగ్స్ ఆఫర్ చేశారని కానీ వాటికి దూరంగా ఉండటం వల్లే సక్సెస్ ఫుల్ హీరోగా నిలబడగలిగానని చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టే పైకి కనిపించకపోయినా కొందరు ఈ మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్నట్టు అర్థమవుతోంది. కాకపోతే సరైన ఆధారాలు లేకుండా కేవలం ప్రచారాలను బట్టి తమ మీద అభాండాలు వేయొద్దని సురేఖావాణి చేసిన విన్నపానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి
This post was last modified on June 25, 2023 9:30 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…