Movie News

ఆదిపురుష్ మీద సెహ్వాగ్ పంచు

మన దేశంలో సినిమాలకు క్రికెట్ కున్నంత క్రేజ్ దేనికీ లేదు. వేర్వేరు రంగాలే అయినప్పటికీ రెండింటి మీద విపరీతమైన అభిమానం కలిగిన జనం కోట్లలో ఉన్నారు. అందుకే వీటికి ముడిపడిన ఏ అంశమైనా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ మీద ఎంత నెగటివ్ క్యాంపైన్ నడిచిందో కళ్లారా చూశాం. దెబ్బకు హీరోతో సహా ఎవరైనా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడితే ఒట్టు. దర్శకుడు రచయిత తప్ప రిలీజ్ తర్వాత కెమెరా ముందు కనిపించిన మొహాలే లేవు. వసూళ్ల పరంగా బాగా నెమ్మదించిన ఆదిపురుష్ కి  ఇవాళ వీకెండ్ కీలకం కానుంది.

ఇదిలా ఉండగా ఈ విజువల్ గ్రాండియర్ ని ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చూశాడు. మాములుగా ట్విట్టర్ లో పంచులతో అదరగొడుతూ నవ్వించే ఈ ఎటాకింగ్ బ్యాట్స్ మ్యాన్ ఆదిపురుష్ ని కూడా వదల్లేదు. షో అయ్యాక ట్వీట్ చేస్తూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు తెలిసిందని కౌంటర్ వేశాడు. ఇది అర్థమైనవాళ్లకు నవ్వాగడం లేదు. అంటే భవిష్యత్తులో ప్రభాస్ ఇలాంటి పొరపాట్లు చేస్తాడని ముందే గుర్తించిన సత్యరాజ్ అతన్ని కాపాడటం కోసమే కత్తితో పొడిచాడని సెహ్వాగ్ నిర్వచనం. పెట్టడం ఆలస్యం ఇతని పంచు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది

విచిత్రంగా ట్రోలింగ్ బ్యాచులతో  సెహ్వాగ్ గొంతు కలపడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మొదటి మూడు రోజులు మూడు వందల కోట్లు గ్రాస్ సాధించినా బ్రేక్ ఈవెన్ కి ఇంకా చాలా దూరంలో ఆగిపోయిన ఆదిపురుష్ ఫైనల్ గా ఫ్లాప్ నుంచి తప్పుకోవడం అసాధ్యమే. మొన్న చెప్పుకోదగ్గ రిలీజులేవి లేకపోవడంతో ఓ మాదిరిగా నెట్టుకొస్తున్నప్పటికీ అది భారీ నష్టాలను పూడ్చేందుకు చాలడం లేదు. పైగా కేరళ, తమిళనాడులో డిజాస్టర్ కావడం మరింత దెబ్బ కొట్టింది. నార్త్ ఆడియన్స్ కన్నా మన ప్రేక్షకులే నయం. పది రోజులకు తర్వాత కూడా ఓ పర్వాలేదనిపంచే బుకింగ్స్ ఇక్కడే ఉన్నాయి 

This post was last modified on June 25, 2023 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago