పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఆయన వారాహి యాత్ర మీదే ఉంది. సినిమాలకు మించిన కిక్ ఇస్తూ.. ఈ యాత్రలో అభిమానులతో పాటు జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నాడు పవన్. ఈ కిక్ ఇలా కొనసాగుతుండగానే.. ఆయన కొత్త సినిమా టీజర్ విందు సిద్ధం అవుతోంది. పవన్ కళ్యాణ్ కొన్ని నెలల కిందటే చడీచప్పుడు లేకుండా ‘బ్రో’ సినిమాను మొదలుపెట్టడం.. కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొని తన పార్ట్ అంతా పూర్తి చేయడం తెలిసిన సంగతే. ఈ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశలో ఉంది. విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక ప్రమోషన్ల హడావుడి పెంచాల్సిన అవసరం పడింది. అందులో భాగంగా ముందుగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ అంటే వారం ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ ‘బ్రో’ విషయంలో సైలెంటుగా పని జరిగిపోతోంది. నిమిషం నిడివితో ఉండే టీజర్ ఆల్రెడీ దాదాపుగా రెడీ అయిపోయిందట. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చేశాడని సమాచారం. చిన్న చిన్న కరెక్షన్లు చేసి ఈ రోజుకు టీజర్ కట్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లోనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని అంటున్నారు.
టీజర్ పవన్ అభిమానులను అలరించేలా ఉంటుందని.. రీమేక్ కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా ఉన్న ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ మార్పులు చేర్పులతో స్క్రిప్టు రెడీ చేశాడు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 24, 2023 11:30 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…