నిన్న విడుదలైన సినిమాల్లో దేనికీ ప్రీ రిలీజ్ బజ్ లేకపోవడంతో థియేటర్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే కనిపించాయి. మొదటిరోజే చూడాలన్నఉత్సాహం ఆడియన్స్ వీటి మీద చూపించలేదు. ఉన్నంతలో ట్రైలర్ కట్ వల్ల మను చరిత్ర మీద యూత్ కొంత ఆసక్తి కనబరిచారు. కొన్నేళ్ల క్రితం కాజల్ అగర్వాల్ సమర్పణలో మొదలైన ఈ చిత్రం తర్వాత చేతులు మారింది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా మోక్షం మాత్రం ఇప్పటికి దక్కింది. పుష్ప విలన్ ధనుంజయ్, సుహాస్, మేఘ ఆకాష్ లాంటి ఆకట్టుకునే క్యాస్టింగ్ ఉన్నప్పటికీ బజ్ కోసం పోరాడింది. ఇంతకీ చరిత్రలో ఏముంది.
మను(శివ కందుకూరి)అనే కుర్రాడు ఓ రౌడీ(ధనుంజయ్)దగ్గర పని చేస్తుంటాడు. ఇతనికో భగ్నమైన ప్రేమకథ ఉంటుంది. దాంతో అమ్మాయిలను ప్రేమించడం తర్వాత బ్రేకప్ చెప్పడం అలవాటుగా చేసుకుంటాడు. మరోవైపు సిటీ మేయర్ కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది. సంబంధమే లేని ఈ రెండు కథలకు ఉన్న కనెక్షన్ ఏంటి, చివరికి మను జీవితంలో ఏ లక్ష్యానికి చేరుకున్నాడనేదే కథ. శివ కందుకూరి తన వరకు పెర్ఫార్మన్స్ పరంగా బాగానే చేసినప్పటికీ రఫ్ షేడ్స్ ని పూర్తిగా మోయలేకపోయాడు. అంత బరువైన ఎమోషన్స్ లో చూడటం కష్టమైపోయింది.
దర్శకుడు భరత్ పెదగాని అర్జున్ రెడ్డి నుంచి ఎక్కువ స్ఫూర్తి చెందాడు. కేవలం లవ్ స్టోరీ చెబితే దానికి జిరాక్స్ అనుకుంటారని భావించి పొలిటికల్ కలర్ అద్దే ప్రయత్నం చేశాడు. అయితే బలహీనమైన స్క్రీన్ ప్లే, రిపీట్ గా అనిపించే ఉపకథలు, విపరీతమైన సెకండ్ హాఫ్ ల్యాగ్ మనుచరిత్రని భరించలేని ప్రహసనంగా మారాయి. విజయ్ దేవరకొండ రేంజ్ లో ఇంత బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్ ని డిజైన్ చేసుకోవడం సింక్ అవ్వలేదు. తారాగణం పరంగా ఎలాంటి కంప్లయింట్ లేనప్పటికీ ఆసక్తికరంగా చదవాల్సిన చరిత్ర పుస్తకాన్ని చివరి పేజీకి వచ్చేటప్పటికి విసిగించే స్థాయిలో నరేషన్ ఉండటంతో మను ఫైనల్ గా గెలవలేకపోయాడు
This post was last modified on June 24, 2023 2:21 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…