Movie News

సెప్టెంబర్ చాలా స్పెషల్ గురూ

మాములుగా జనవరి నెల స్టార్ హీరోల కొత్త సినిమాల సందడితో, థియేటర్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఆ సీజన్ అందరికీ దొరకదు, సాధ్యం కాదు కాబట్టి కంటెంట్ మీద నమ్మకం ఉంటే చాలు ఏ మంత్ అయినా సరే నిర్మాతలు సై అంటున్నారు. రాబోయే సెప్టెంబర్ మూవీ లవర్స్ కి మాములు పండగ ఇచ్చేలా లేదు. 1న విజయ్ దేవరకొండ-సమంతా కలయికల ‘ఖుషి’ మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. వచ్చిన ఒక ఆడియో సింగల్ ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయిపోయింది. మిగిలిన పాటల మీద హోప్స్ పెరిగాయి. మైత్రి నిర్మాణం కాబట్టి మంచి రిలీజ్ దక్కుతుంది.

వారం తిరక్కుండానే 7వ తేదీ షారుఖ్ ఖాన్ -నయనతార ‘జవాన్’ వచ్చేస్తాడు. సౌత్ డైరెక్టర్ ఆట్లీ తీసింది కావడంతో నిర్మాతలు ఈసారి దక్షిణాదిలోనూ గట్టి థియేటర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. పఠాన్ తర్వాతి మూవీ కావడంతో సగటు ప్రేక్షకుల్లోనూ హైప్ బాగుంది. 15న సిద్దు జొన్నలగడ్డ-రామ్ లు తలపడతారు. టిల్లు స్క్వేర్, బోయపాటి రాపోలు క్లాష్ కూడా రెడీ అయ్యాయి. రామ్ సినిమాకి ‘స్కంద’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అయితే సెప్టెంబర్ 22న ఎవరూ కర్చీఫ్ వేయలేదు. ఎందుకంటే 28న రాబోయే ‘సలార్’ దెబ్బకు అంత తక్కువ గ్యాప్ కి నో అంటున్నారు

కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ మీద హైప్ గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆదిపురుష్ ఫలితం దీని మీద ఎంత మాత్రం ఉండబోవడం లేదని బిజినెస్ చూస్తేనే అర్థమవుతోంది. మొత్తానికి వచ్చే నెల నుంచి పరీక్షలు, స్కూళ్ళు, చలి, వర్షాలతో సంబంధం లేకుండా క్రేజీ రిలీజులన్నీ క్యూ కడుతున్నాయి.  వేసవి మొత్తం డ్రైగా గడిచిపోయిన ట్రేడ్ వర్గాలు విరూపాక్ష తర్వాత ఆ స్థాయి లాభాలు ఇచ్చిన సినిమా మరొకటి చూడలేదు. దసరా, బలగంలు వేసవికి ముందు వచ్చినవి. జూలై, ఆగస్ట్ లోనూ మంచి రిలీజులున్నాయి కానీ సెప్టెంబర్ మాత్రం స్పెషల్ కాబోతోంది 

This post was last modified on June 23, 2023 8:47 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago