Movie News

తండ్రయ్యాక రామ్ చరణ్ తొలి పలుకులు

మెగా ఫ్యామిలీ ఇప్పుడు మామూలు ఆనందం లేదు. రామ్ చరణ్‌ను తండ్రిగా చూడాలని దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. చరణ్ భార్య ఉపాసన మూడు రోజుల కిందటే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజంతా మీడియాలో ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి దగ్గర హడావుడి కాస్త తగ్గాక శుక్రవారం ఉపాసనను డిశ్చార్జి చేశారు.

చరణ్ తన బిడ్డను, భార్యను వెంటబెట్టుకుని ఆసుపత్రి బయటికి వచ్చి మీడియాతో కొన్ని మాటలు మాట్లాడారు. పాప తన లాగే ఉందని చరణ్ అమితానందంతో చెప్పాడు. ఆడబిడ్డకు తండ్రి పోలిక ఉంటే అదృష్టం అని అంటారు. ఈ నేపథ్యంలోనే చరణ్ పాప తనలాగే ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు మీడియాతో. తన బిడ్డ మీద అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించిన ప్రేమకు ధన్యుడినని చరణ్ అన్నాడు.

ఒక తండ్రిగా తనకు ఇంతకంటే ఆనందం ఏం ఉంటుందని.. తన తండ్రి కూడా చాలా సంతోషంగా ఉన్నారని చరణ్ తెలిపాడు. అపోలో వైద్యులు ఉపాసనను, పాపను చాలా బాగా చూసుకున్నారని.. వాళ్లందరికీ ధన్యవాదాలని చరణ్ చెప్పాడు. తమ పాపకు ఏం పేరు పెట్టాలనే విషయంలో తాను, ఉపాసన ఇప్పటికే ఒక మాట అనుకున్నామని.. ఐతే ఇప్పుడే తన పేరు వెల్లడించబోనని.. తర్వాత ప్రకటిస్తానని చరణ్ చెప్పాడు. 

This post was last modified on June 23, 2023 4:51 pm

Share

Recent Posts

కిరాతకుడు హేమంత్ పై కాల్పులు – సంబరాల్లో ప్రజలు

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…

15 minutes ago

మళ్లీ శింబు-నయన్ జోడీ… నమ్మొచ్చా?

తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…

8 hours ago

టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో తెలుగు నేతలు

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…

9 hours ago

జ‌గ‌న్ ఆశ తీరుతుందా?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులి వెందుల‌లో ఆదివారం హ‌ల్చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.…

9 hours ago

తమన్ గమనిస్తున్నాడా?

తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు తమన్. వేరే భాషల్లోనూ తరచుగా సినిమాలు చేస్తున్నాడు. తన…

9 hours ago

రాప్తాడు స్కూల్ దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు

రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు హేమంత్‌పై పోలీసులు…

10 hours ago