నిఖిల్ హీరోగా రాబోతున్న స్పై ట్రైలర్ చూశాక అంచనాలు మరింత బలపడ్డాయి. హడావిడి విడుదలే అయినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ డేట్ మీద రాజీ పడని నిర్మాత పట్టుదలకు హీరో కూడా మద్దతు ఇచ్చేశాడు. తక్కువ టైంలో పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు చేయాల్సిన పనిని వందల సంఖ్యలో రోజుల తరబడి కూర్చుని తమ టీమ్ పూర్తి చేసిందని నిఖిల్ కితాబిచ్చాడు. ఇంకో ఆరు రోజులే ఉంది కాబట్టి ఇవాళ ముంబై మీడియాతో ముఖాముఖి తర్వాత ఇతర రాష్ట్రాల్లో చేయాల్సిన కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్యాన్ ఇండియా రిలీజ్ కనక ఒత్తిడి ఎక్కువగా ఉంది
ఇక స్పై ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ 27న హైదరాబాద్ శిల్పకళావేదికలో చేయబోతున్నారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. అధికారికంగా రేపో ఎల్లుండో ప్రకటిస్తారు. ఇక్కడే ఓ సెంటిమెంట్ ఉంది. గతంలో అర్జున్ సురవరం కూడా ఇదే తరహాలో విడుదల టైంలో తీవ్ర ఒత్తిడి ఎదురుకుంది. అసలు రిలీజ్ అవుతుందా లేదానే అనుమానాల మధ్య పలు వాయిదాలు పడుతూ ఆఖరికి థియేటర్లకు వచ్చి మంచి హిట్టు కొట్టింది. దానికి అప్పుడు గెస్ట్ గా చిరంజీవీ రావడం ప్లస్ అయ్యిందని నిఖిల్ ఓపెన్ గానే చెప్పాడు. ఇప్పుడు స్పై కూడా రిలీజ్ పరంగా చిక్కులు ఎదురుకోవడం చూశాం
సో ఈ లెక్కన సురవరం సెంటిమెంట్ కనక పని చేస్తే స్పై కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. నిఖిల్ మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉండే మెగాస్టార్ కు తన మీద ఉన్న పర్సనల్ అఫెక్షన్ తప్ప ఇంకే రకంగానూ స్పై బృందంతో అనుబంధం లేదు. ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో రూపొందిన స్పైకు శ్రీవిష్ణు సామజవరగమన తప్ప ఎలాంటి పోటీ లేదు. ఆదిపురుష్ నెమ్మదించిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద నిఖిల్ కు మంచి ఛాన్స్ దొరికింది. టాక్ కనక పాజిటివ్ గా వస్తే మంచి వసూళ్లు దక్కుతున్నాయి. కాకపోతే హిందీలో సత్యప్రేమ్ కి కథ కాంపిటీషన్ ని ఎదురుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on June 23, 2023 12:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…