క్రియేటివిటీకి హద్దులు ఉండవు నిజమే. కాకపోతే సరైన వేదిక సందర్భం రావాలి అంతే. హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా మ్యాడీ మాధవ్ అనే యువకుడు ఒక వీడియో తయారు చేశాడు. తనకు వచ్చిన యానిమేషన్ టెక్నాలజీని వాడి త్రీడి సాంకేతికత జోడించి ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. మొత్తం 3 నిమిషాల 30 సెకండ్లున్న వీడియో ట్విట్టర్ ని ఒక్కసారిగా ఊపేసింది. ఇరవై నాలుగు గంటలు గడవకుండానే ఏకంగా 8 మిలియన్ల వ్యూస్ కి దగ్గరగా వెళ్ళిపోయి లక్షా ఇరవై వేల లైకులు, 40 వేలకు దగ్గరలో రీ ట్వీట్లు తెచ్చేసుకుంది. అయిదు వేల కొటేషన్లు పడటం మరో షాక్.
అంతగా ఇందులో ఏముందంటే తన శత్రువును లక్ష్యంగా పెట్టుకుని కారులో నిర్మానుష్యంగా ఏడాది లాంటి ప్రాంతం మధ్యలో ఉన్న రోడ్ల మీద వెళ్తున్న విజయ్ ప్రయాణంలో ఉండగానే టార్గెట్ ని షూట్ చేస్తాడు. బండి దిగేసి తన కోసం వెనకే వస్తున్న పదుల సంఖ్యలో వాహనాల్లో దిగుతున్న వాళ్లకు కత్తి తీసి స్వాగతం చెబుతాడు. నిజంగానే నటించాడేమో అన్నంత లైవ్లీగా మాధవ్ దీన్ని రూపొందించాడు. రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందంటే వెంకట్ ప్రభు, మనోజ్ పరమహంస, అశ్విన్ రామ్, మణికందన్ లాంటి ప్రముఖులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేశారు.
ఇది చాలా వైరల్ అయిపోయింది. నిజంగానే ఫ్యాన్స్ కి కథలు రాసే తీసే ఛాన్స్ ఇస్తే అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి మాధవ్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇతగాడి టాలెంట్ ఎంతగా రీచ్ అయ్యిందంటే పవన్ మహేష్ తారక్ అభిమానులు తమకూ అలాంటి వీడియో ఒకటి చేసి పెట్టమని, కావాలంటే దానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటామని ఆఫర్లు ఇస్తున్నారు. స్వయానా హీరో విజయ్ ఇది చూసి ఒకసారి రమ్మని కబురు పెట్టాడని చెన్నై టాక్. మొత్తానికి ప్రతిభతో కూడా సోషల్ మీడియా ఏ స్థాయి గుర్తింపు తెస్తుందో ఇంతకన్నా ఉదాహరణ కావాలా.
This post was last modified on June 22, 2023 9:13 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…