మాములుగా కొత్త సినిమా ప్రీ రిలీజ్ ప్రీమియర్లు ఏదైనా ల్యాబ్ లో లేదా మల్టీప్లెక్సులో వేయడం సహజం. ఇది అందరూ చేసేదే చేస్తున్నదే. నలుగురు వెళ్లే రూట్ మనమెందుకు అనుకున్నాడు బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా. ఈయన నిర్మించిన కొత్త చిత్రం బవాల్ వచ్చే నెల అమెజాన్ ప్రైమ్ ద్వారా 200 దేశాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. వరుణ్ ధావన్ – జాన్వీ కపూర్ జంటగా రూపొందిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. చిచోరేకి జాతీయ అవార్డు సాధించిన నితీష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందింది
ఇంత పెద్ద గ్రాండియర్ ని ఓటిటికి ఇవ్వడం పట్ల ఇప్పటికే బయ్యర్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బవాల్ ప్రీమియర్ ని ఏకంగా పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ లో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటి దాకా ఏ ఇండియన్ సినిమా ఈ ఘనత సాధించలేదు. పారిస్ నగర అందాలు బ్యాక్ గ్రౌండ్ లో కనువిందు చేస్తుండగా భూమికి ఆకాశానికి మధ్యలో బవాల్ ని స్క్రీన్ చేయబోతున్నారు. టీమ్ తో పాటు ఫ్రెంచ్ డెలిగేట్స్ ఈ షోకు హాజరు కాబోతున్నారు. దీనికి ఇంకో కారణం ఉంది. ఈ మూవీ షూటింగ్ లో కొంత భాగం పారిస్ లోనే చేశారు. అందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు
ఇలాంటి కొత్త ట్రెండ్స్ తీసుకొస్తే తప్ప ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకోలేని పరిస్థితిలో ప్రొడ్యూసర్లు కొత్తకొత్తగా ఆలోచిస్తున్నారు. ఇది కనక సక్సెస్ అయితే భవిష్యత్తులో తాజ్ మహాల్ మైదానంలో, గ్రేట్ వాల్ అఫ్ చైనా గోడల మీద, ఈజిప్టు పిరమిడ్ల దగ్గర ప్రీమియర్లు వేసినా ఆశ్చర్యం లేదు. ప్రమోషన్ లో క్రియేటివిటీ అంటే ఇదే కాబోలు. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న బవాల్ మీద పెట్టుబడి పెరిగిపోవడంతో సాజిద్ నడియాడ్ వాలా ప్రైమ్ ఇచ్చిన టెంప్టింగ్ ఆఫర్ ని కాదనలేక అటువైపు మొగ్గుచూపారు. షీర్షా తరహాలో ఇదీ తమకు బ్లాక్ బస్టరవుతుందనే నమ్మకంతో ఉంది అమెజాన్
This post was last modified on June 22, 2023 3:45 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…