మాములుగా ఒక హీరోయిన్ కి డెబ్యూతోనే డిజాస్టర్ పడితే అవకాశాలు అంత సులభంగా రావు. అందులోనూ టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువ. ఒక హిట్టు పడ్డాక చూద్దాంలే అని ఎదురు చూస్తారు. కానీ సాక్షి వైద్యకు సీన్ రివర్స్ లో ఉంది. అఖిల్ ఏజెంట్ తో తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఎంట్రీనే చేదు అనుభవం ఇచ్చింది. ఈ ఏడాది అది పెద్ద ఫ్లాప్ గా ఏజెంట్ గురించి ఎన్ని ట్రోల్స్ వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. దెబ్బకు ఓటిటి వెర్షన్ కోసం మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చిందంటేనే ఆడియన్స్ దాన్ని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు.
ట్విస్ట్ ఏంటంటే సాక్షి వైద్యకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. మెగా ప్రిన్స్ గాండీవధారి అర్జునలో ఆల్రెడీ చేస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందబోయే గాంజా శంకర్(ప్రచారంలో ఉన్న టైటిల్)కి తన పేరే బలంగా పరిశీలిస్తున్నారట. ఓకే కాగానే అఫీషియల్ గా ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల కాకుండా సెకండ్ హీరోయిన్ గా సాక్షినే అడిగినట్టు ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. కానీ రెండో కథానాయిక కాబట్టి ఇంకా ఎస్ చెప్పలేదట. పవర్ స్టార్ కాబట్టి కాదనే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు
ఇవి కాకుండా మరికొన్ని ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం తెలుగు హీరోలు దర్శకులను హీరోయిన్ కొరత విపరీతంగా వేధిస్తోంది . పూజా హెగ్డే ట్రాక్ రికార్డు, మార్కెట్ రెండూ పడిపోయాయి. రష్మిక మందన్న ఎక్కువ బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతోంది. శ్రీలీల డేట్లు కావాలంటే ఆరేడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో సాక్షి వైద్య లాంటి వాళ్లకు ఇదంతా వరంగా మారుతోంది. మనమే హిట్టిస్తే పోలా అనే ధోరణిలో డైరెక్టర్లు తనను ఎంచుకుంటున్నారు కాబోలు. వీటిలో ఏది సక్సెస్ అయినా పెద్ద బ్రేక్ దక్కినట్టే.
This post was last modified on June 22, 2023 1:42 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…