పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్య టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థ పేరిది. ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఈ మధ్య దూకుడు పెంచింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో ఆ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. ఇవి కాక బోలెడన్ని సినిమాలు ఆ సంస్థలో ప్లానింగ్‌లో ఉన్నాయి. ఈ సంస్థ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలనే అందుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయి, వంద కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టిన ‘కార్తికేయ-2’లో పీపుల్స్ మీడియా వాళ్లు భాగస్వాములు. ఆ సినిమా స్థాయికి అది సాధించిన వసూళ్లు అనూహ్యం. ఇక ఏడాది చివర్లో ‘ధమాకా’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది పీపుల్స్ మీడియా. ఇది పూర్తిగా వారి సినిమానే. ఇది కూడా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా వరుసగా రెండు భారీ విజయాలతో పెద్ద ఎత్తున లాభాలు మూటగట్టుకుందా సంస్థ. ఈ విజయాల ఊపులోనే భారీ చిత్రాలను ప్లాన్ చేసింది.
కానీ 2023లో పీపుల్స్ మీడియా వాళ్లకు అస్సలు కలిసి రావడం లేదు. ఆ సంస్థ మంచి బడ్జెట్లో నిర్మించిన ‘రామబాణం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయింది. కొంచెం గ్యాప్‌లో ఇప్పుడు పీపుల్స్ మీడియా పెద్ద రిస్క్ చేసింది. ‘ఆదిపురుష్’కు రిలీజ్ ముంగిట వచ్చిన హైప్ చూసి.. యువి క్రియేషన్స్ వాళ్ల దగ్గర మారు బేరానికి సినిమాను కొనుగోలు చేసింది. ఏకంగా రూ.170 కోట్లకు పైగా ఇందుకోసం పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
తొలి రోజు ఓపెనింగ్స్ చూస్తే ఆశాజనకంగానే కనిపించింది కానీ.. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదివారం తర్వాత సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. వీకెండ్ తర్వాత షేర్ నామమాత్రంగా వస్తోంది. ఓవరాల్ షేర్ వంద కోట్లను దాటే అవకాశాలే కనిపించడం లేదు. దీన్ని బట్టి పీపుల్స్ మీడియా వాళ్లు ఎంత పెద్ద నష్టం చూడబోతున్నారో అంచనా వేయొచ్చు. కొన్ని ఏరియాల వరకు వేరే బయ్యర్లకు అమ్ముకుని కొంత నష్టాలు భర్తీ చేసుకుని ఉండొచ్చు కానీ.. ఓవరాల్‌గా మాత్రం పెద్ద నష్టమే తప్పేలా లేదు.
This post was last modified on June 22, 2023 7:53 am
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…