వెబ్ సిరీస్ లో శారీరక సంబంధాలకు సంబంధించి కంటెంట్ వడ్డించడంలో నెట్ ఫ్లిక్స్ దిట్ట. ఏదో ఆషామాషీగా కాకుండా పెద్ద పెద్ద స్టార్లను తీసుకొచ్చి మరీ సెక్స్ పట్ల ఆడియన్స్ దృక్పథాన్ని మార్చేలా చేయడంలో దర్శక రచయితలు పోటీ పడుతుంటారు. వాటిలో లస్ట్ స్టోరీస్ కి చాలా పేరొచ్చింది. అంతర్జాతీయంగా అవార్డులు, గుర్తింపు దక్కాయి. తెలుగులో అదే టైటిల్ తో తీశారు కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 పేరుతో ఇంకో భాగం వస్తోంది. జనాలు దీన్నుంచి ఏమి ఆశిస్తున్నారో దానికి తగ్గట్టే కామ కథలను కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.
కారు కొనడానికి టెస్ట్ డ్రైవ్ కు వెళ్ళినట్టే పెళ్లి చేసుకునే ముందు జీవిత భాగస్వామిని అన్ని రకాలుగా పరీక్షించుకోవడంలో తప్పేమి లేదనే ఒక భామ(నీనా గుప్తా). మధ్య వయసు దాటిన భార్య(కాజోల్)ఉన్నా పనిమనిషి మీద మోజు పడే సగటు మిథిలా క్లాస్ భర్త. పదేళ్ల క్రితం విడిపోయిన ప్రియుడు వస్తే అతనితో ఎలాంటి బంధం కొనసాగించాలో అర్థం కాని ఓ మహిళ(తమన్నా). చేసుకునే వాడు ఎలాంటి వాడనే అయోమయంలో ఉన్న పెళ్లి కూతురు(మృణాల్ ఠాగూర్). పక్కింటి ఆంటీతో తన భర్తను చూసిన ఓ ఉద్యోగి. ఇలా మొత్తం బాడీ రిలేషన్ మీద కథలను రాసుకున్నారు
బాగా పేరున్న క్యాస్టింగ్ కావడంతో లస్ట్ స్టోరీస్ 2 లో గ్లామర్ అట్రాక్షన్ కనిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తిరిగి మేకప్ వేసుకుంటున్న కాజోల్ కొత్తగా ఉంది. నిజ జీవిత ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా రొమాన్స్ ఇందులో లైవ్ గా అనిపిస్తోంది. ఆర్ బాల్కి – కొంకణా సేన్ శర్మ – సుజయ్ ఘోష్ – అమిత్ రవీంద్రనాథ్ శర్మ లు దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ ఎంటర్ టైనర్ మొదటి భాగం కంటే డోస్ కాస్త తగ్గించినట్టు క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా కామాతురాణాం న సిగ్గు న భయం అని ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు న్యూ జనరేషన్ కి ఇలాంటి లస్ట్ స్టోరీస్ తో భలే సందేశాలు ఇస్తున్నారు
This post was last modified on June 21, 2023 3:32 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…