Movie News

రష్మిక చేతికి చారిత్రాత్మక సినిమా

పుష్ప తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ చూడలేకపోయిన రష్మీక మందన్నకు అవకాశాలు మాత్రం బానే వస్తున్నాయి. సీతారామం ఎంత పెద్ద హిట్ అయినా క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ తీసేసుకుంది. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడలేదు. వారసుడు విజయ్ ఇమేజ్ మీద ఆడేసింది. అందుకే బాలీవుడ్ ని టార్గెట్ గా పెట్టుకున్న కన్నడ భామ దానికి తగ్గట్టే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. అమితాబ్ బచ్చన్ తో చేసిన డెబ్యూ మూవీ గుడ్ బై ఫ్లాప్ అయినా, సిద్దార్థ్ మల్హోత్ర సరసన మిషన్ మజ్నులో నటించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు.

రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన యానిమల్ మీద రష్మిక బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇది తనకు పెద్ద బ్రేక్ అవుతుందని, మెయిన్ లీగ్ లో ప్రవేశించేందుకు దారి చూపుతుందని నమ్ముతోంది. ఈలోగా మరో ప్యాన్ ఇండియా మూవీ ఖాతాలో పడేలా ఉంది. విక్కీ కౌశల్ సరసన పీరియాడిక్ డ్రామా చావాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ముంబై అప్డేట్. ఇటీవలే వచ్చిన జర హట్కె జర బచ్కె దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దీనికి కెప్టెన్. బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నారు. మరాఠి చారిత్రాత్మక నవల ఆధారంగా చావా రూపొందనుంది

ఇక్కడంటే స్టార్ హీరోల సరసన చేసేందుకే సౌత్ హీరోయిన్లు మొగ్గు చూపుతున్నారు కానీ హిందీకి మాత్రం అలాంటి కండీషన్లు ఏమీ పెట్టడం లేదు. విక్కీ కౌశల్ కు ఎంత ఇమేజ్ ఉన్నా మరీ రణ్వీర్ సింగ్ అంత రేంజ్ అయితే కాదు. చావాలో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కాబట్టి సరిగ్గా క్లిక్ అయితే షారుఖ్, సల్మాన్ లాంటి వాళ్ళ సరసన ఆఫర్లు ఆశించవచ్చు. ఇటు తెలుగులో పుష్ప 2 కాకుండా రష్మిక ఒప్పుకున్న సినిమా ఏదీ లేదు. రైన్ బో పూర్తి కావొస్తోంది. శ్రీలీల దెబ్బకు అందరూ ఆమెనే అడుగుతుండటంతో రష్మికతో పాటు పూజా హెగ్డే డిమాండ్ తగ్గిన మాటైతే వాస్తవం  

This post was last modified on June 20, 2023 6:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

15 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

45 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago