భయపడినట్టే సోమవారం పరీక్షలో ఆదిపురుష్ ఫెయిలయ్యాడని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని చోట్ల మినహా దాదాపు 70 నుంచి 80 శాతం దాకా డ్రాప్ కనిపించడం బయ్యర్లను ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మూడు రోజులకు గాను మూడు వందల నలభై కోట్ల గ్రాస్ వచ్చిందని యూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన ఖచ్చితత్వం గురించి బాలీవుడ్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. వీటి సంగతి పక్కనపెడితే వీక్ డేస్ లో కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీ కొనసాగిస్తేనే స్టార్ హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్లవుతాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిన్న ఆదిపురుష్ 5 కోట్ల షేర్ అందుకోవడమే కష్టమైపోయింది. అంతకు ముందు ఆదివారం 17 కోట్లకు పైగా వసూలు కాగా ఒక్కసారిగా ఇంత మొత్తానికి తగ్గిపోవడం చిన్న విషయం కాదు. నార్త్ లోనూ దీనికి భిన్నంగా పరిస్థితి లేదు. కొన్ని నగరాల్లో ప్రదర్శనలు ఆపాలని నిరసనలు, ధర్నాలు చేయడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది. ఇప్పటిదాకా 163 కోట్ల షేర్ వసూలు చేసిన ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో 80 కోట్ల రాబట్టాల్సి ఉంటుంది. పది రోజులు స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
రాబోయే రోజుల్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా ఆదిపురుష్ ఆ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. వీకెండ్ మీద తప్ప మిగిలిన రోజుల్లో పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేనట్టుగా ఉంది. ఉన్నంతలో నైజామ్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ బాగుంది. కానీ కీలకమైన బిసి సెంటర్లలో జనం అంతగా ఆసక్తి చూపడం లేదని ఫిగర్లు చెబుతున్నాయి. తమిళనాడు, కేరళలో డిజాస్టర్ ఫలితం రాగా తెలుగు, హిందీ వెర్షన్లకు సంబంధించి యావరేజ్ అవుతుందా లేదా నష్టాలు తెచ్చిన ఫ్లాప్ గా మిగులుతుందా ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది
This post was last modified on June 20, 2023 1:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…