హీరో నిఖిల్ అప్ కమింగ్ మూవీ ‘స్పై’ చుట్టూ నిన్నటి వరకూ ఓ వివాదం నడిచింది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 29నే రిలీజ్ చేయాలని నిర్మాత పట్టు బట్టారు. ఈ సినిమాను నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు రాజశేఖర్ రెడ్డి. ముందు ప్లానింగ్ ప్రకారం జూన్ 29న మంచి డేట్ అనుకొని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ అనుకున్నట్టు జరగలేదు. అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. దీంతో నిఖిల్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతను రిక్వెస్ట్ చేశాడు. కానీ నిర్మాత మొండిపట్టుతో హీరో మాట వినకుండా ప్రమోషన్ టీంను మార్చేసి అదే డేట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.
దీంతో హీరో వర్సెస్ నిర్మాత అంటూ స్పై సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే నిర్మాత చెప్పినట్టు అదే డేట్ కి రావడం కుదురుతుందా ? అనుకున్న టీం ఇప్పుడు శరవేగంగా రాత్రి పగలు వర్క్ చేస్తూ ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్నారు. దర్శకుడు గ్యారీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టి ఫాస్ట్ గా రెడీ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించి కొంత ఘాట్ బ్యాలెన్స్ ఉండటంతో ఒక వైపు ఘాట్ ఫినిష్ చేస్తూ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నారు.
తాజాగా జరిగిన డిస్కషన్ లో నిర్మాత ప్రకటించిన డేట్ కి సినిమాను రిలీజ్ చేసేందుకు హీరో అంగీకరించాడు. ట్విటర్ లో టార్గెట్ లాక్ అంటూ రిలీజ్ డేట్ ను మరోసారి స్పష్టం చేశాడు నిఖిల్. ఈ మొత్తం సినారియోలో హీరో నిఖిల్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ఏదేమైనా సినిమా అనే మద్యమం ముందు హీరో , నిర్మాత ఇలా ఏవరైనా చిన్నే అవుతారు. చివరికి సినిమానే పెద్దదిగా కనిపిస్తుంది. టీంకి చాలా తక్కువ టైమ్ ఉంది. రిలీజ్ కి ఇంకో పది రోజులే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ఫైనల్ గా స్పై ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో ? చూడాలి.
This post was last modified on June 20, 2023 7:08 am
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…