ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సినిమా ఏ మాత్రం డిస్సపాయింట్ చేసినా వెంటనే ట్రోలింగ్ మొదలెట్టేస్తున్నారు నెటిజన్లు. తాజాగా రిలీజైన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ పై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. రిలీజ్ రోజు మార్నింగ్ నుండే ట్రోలర్స్ రంగంలోకి దిగారు. వివిధ రకాల ట్రోల్స్ , మీమ్స్ తో సినిమాను టార్గెట్ చేస్తూ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఇప్పటికీ ఆదిపురుష్ మీద గట్టి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
నిజానికి టీజర్ నుండే ప్రభాస్ సినిమాకు ట్రోల్ స్టార్ట్ అయింది. టీజర్ లో హనుమాన్ కేరెక్టర్ , రావణసురుడి గెటప్ మీద నెగటివిటీ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా పూర్ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో మేకర్స్ మళ్ళీ రీ వర్క్ చేసి వీ ఎఫ్ ఎక్స్ మీద శ్రద్ద పెట్టి ట్రైలర్ తో మెప్పించారు. అయితే ఆదిపురుష్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన బడ్జెట్ కి ఇదేనా నీ వర్క్ అంటూ నెటిజన్లు వివిధ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
దీంతో ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి సంతోషపడాలా ? లేదా ట్రోలింగ్ కి బాధ పడాలా ? అనే డైలమాలో ఉన్నాడు ఓం. నిజానికి భారీ బడ్జెట్ తో తీసే ఫాంటసీ , హిస్టారికల్ మూవీస్ మీద దర్శకులు ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంది. మొన్నీ మధ్యే గుణ శేఖర్ ను శాకుంతలం విషయంలో నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్ చూసి రిలీజ్ తర్వాత గుణ శేఖర్ ఎక్కడా కనిపించకుండా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఓంకి కూడా అదే పరిస్థితి. శాకుంతలంతో పోలిస్తే ఆదిపురుష్ మీద భారీ స్థాయిలో ట్రోల్ జరుగుతుంది.
ఓం రౌత్ రామాయణం లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం , మోడ్రన్ పేరుతో కొన్ని మార్పులు చూసి తెరకెక్కించడం ప్రేక్షకులను నిరాశ పరిచింది. పైగా రావణాసురుడి గెటప్ , హెయిర్ స్టైల్ , పది తలలు తనకి నచ్చినట్టుగా పైన డిజైన్ చేయడం తేడా కొట్టింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో గుణ శేఖర్ తర్వాత ట్రోలర్స్ చేతికి చిక్కి ఇబ్బంది పడుతుంది ఓం రౌతే. మరి ఆదిపురుష్ ఈ రేంజ్ ట్రోలింగ్ ను తట్టుకుంటూ థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్తుంది. వచ్చే వీకెండ్ లోపు సినిమా ఐదు వందల కోట్ల మార్క్ దాటేసేలా ఉంది. ఇప్పటికే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వరకు వసూళ్లు చేస్తుందో చూడాలి.
This post was last modified on June 20, 2023 7:04 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…