Movie News

OG అన్నయ్య వదిన వీళ్ళే

టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో పవన్ కళ్యాణ్  ఓజి ముందు వరసలో ఉంది. విడుదలకు అతి దగ్గరగా ఉన్న బ్రో కంటే అభిమానులు దీని మీదే విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు పవన్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారాహి యాత్ర కోసం ఏపీలో పర్యటిస్తున్న పవర్ స్టార్ తిరిగి రాగానే మళ్ళీ ఓజి సెట్స్ లో జాయినవ్వబోతున్నాడు. సాహో తర్వాత బాగా గ్యాప్ వచ్చేసిన సుజిత్ దీని మీద రెట్టింపు కసితో పని చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

దీనికి సంబంధించిన కీలక లీక్స్ మంచి ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ అన్నా వదినలుగా కిక్ శ్యామ్, శ్రేయా రెడ్డిలు నటించడం. గతంలో రేసు గుర్రం అల్లు అర్జున్ సోదరుడిగా శ్యామ్ పాత్ర దాని సక్సెస్ లో చాలా ఉపయోగపడింది. తర్వాత అవకాశాలు ఎన్నో వచ్చాయి కానీ ఏదీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ తమిళంకే అంకితమైపోయాడు. ఇప్పుడు ఏకంగా ఓజికి అన్నయ్య అంటే అంతకంటే స్పెషల్ ప్రమోషన్ ఏముంటుంది. శ్రేయా రెడ్డి పేరుకి అన్న భార్యే అయినా క్యారెక్టర్ పరంగా చాలా పవర్ ఫుల్ షేడ్స్ ఉంటాయని వినికిడి.

ఇదొక్కటే కాదు ఇందులో హీరో పాత్ర పేరు గాంధీ అని మరో అప్డేట్. అఫీషియల్ గా ఇవేవి చెప్పకపోయినా సోర్స్ మాత్రం బలంగా ఉంది. రెగ్యులర్ మాఫియా బ్యాక్ డ్రాప్స్ కి భిన్నంగా సుజిత్ ఇందులో చాలా సర్ప్రైజులు ఇవ్వబోతున్నాడట. డిసెంబర్ విడుదలకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమవుతుందనేది పవన్ రాజకీయ ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. మహా అయితే ఇంకో రెండు నెలలు తప్ప అంతకు మించి కాల్ షీట్స్ ఇచ్చే అవకాశం పవన్ కు ఉండకపోవచ్చు. ఆలోగానే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు పూర్తి చేసుకోవాలి 

This post was last modified on June 20, 2023 6:58 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago