టాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే కథానాయకుల్లో రవితేజ ఒకడు. క్యారెక్టర్, విలన్ వేషాలను పక్కన పెడితే.. హీరోగానే ఆయన సినిమాలు 60కి దగ్గరగా ఉండటం విశేషం. పెద్ద స్టార్ అయ్యాక కూడా ఏడాది రెండు మూడు రిలీజ్‌లతో సాగిపోతున్నాడు. ఈ ఏడాది ఆల్రెడీ వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో పలకరించాడు మాస్ రాజా.
దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ రాబోతోంది. ఆ తర్వాత మూడు నెలలకే సంక్రాంతికి ‘ఈగల్’ వస్తుంది. ప్రస్తుతం టైగర్, ఈగల్ చిత్రాల షూటింగ్‌లో సమాంతరంగా పాల్గొంటున్న రవితేజ.. మరోవైపు కొత్త సినిమాల కోసం కథలు వింటున్నాడు. ఆయన ఒకేసారి రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి ఓ కొత్త దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది.
వాసు అనే డెబ్యూ డైరెక్టర్‌తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నాడు. సితార బేనర్లో రవితేజ చేయబోయే తొలి చిత్రం ఇదే. మాస్ రాజాతో సినిమా కోసం సితార వాళ్లు గతంలోనూ ప్రయత్నించారు. ‘భీమ్లా నాయక్’లో రానా పాత్రను రవితేజతోనే చేయించాలని కూడా అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మాస్ రాజా శైలికి తగ్గ కథతో వచ్చిన వాసుతో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు.
మరోవైపు తనకు డాన్ శీను లాంటి హిట్.. బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మాస్ రాజా మళ్లీ జట్టు కట్టబోతున్నాడట. వీరి కలయికలో మైత్రీ సంస్థ సినిమా తీయబోతోందట. గోపీచంద్ చివరి సినిమా ‘వీరసింహారెడ్డి’ని ప్రొడ్యూస్ చేసింది కూడా మైత్రీ వాళ్లే. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీ వేరే ప్రయత్నాలేవో చేశాడు కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో మళ్లీ రవితేజతో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
This post was last modified on June 19, 2023 3:27 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…