సోషల్ మీడియాలో ట్రోల్స్, దర్శక రచయితల మాటల మార్పిళ్లు, అంత పాజిటివ్ గా లేని పబ్లిక్ టాక్, గొప్పగా రాని రివ్యూలు ఇన్ని ప్రతికూలతల మధ్య ఆదిపురుష్ కేవలం మూడు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ ని సాధించడం చిన్న విషయం కాదు. ఇక్కడ రాముడి సెంటిమెంట్ ఎంత బలంగా పనిచేసిందో ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ స్టామినా అంతే సమానంగా మరోసారి రుజువయ్యింది. తనను వాడుకునే సరైన దర్శకుడు టీమ్ దొరకాలే కానీ రికార్డుల ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో బాక్సాఫీస్ సాక్షిగా కళ్ళముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది.
డివైడ్ టాక్ ఉన్న మూవీనే ప్రభాస్ ఇంతగా ఫుల్ చేసినప్పుడు ఇక కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ తో చేతులు కలిపిన సలార్ తో ఎలాంటి వణుకు పుట్టిస్తాడో ఊహించుకోవడం కష్టమే. అసలే ఈ కాంబో మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కేవలం లీకైన ఫోటోలతోనే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేశారు. పైగా ఇది గ్రాఫిక్స్ హడావిడి ఎక్కువగా ఉండని ప్రాపర్ కమర్షియల్ సినిమా. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సెట్ చేశారు. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు లాంటి క్రేజీ కాస్టింగ్ ఉంది. రవి బస్రూర్ సంగీతం సరేసరి. ఇన్ని ఆకర్షణలు ఉన్నప్పుడు ఇక చెప్పేదేముంది
సెప్టెంబర్ 28 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని యూనిట్ సమాచారం. ఖచ్చితంగా అదే డేట్ కి వదిలేలా పక్కా ప్లానింగ్ తో హోంబాలే ఫిలింస్ సర్వం సిద్ధం చేసిందని బెంగళూరు రిపోర్ట్. అయితే ఇది ఒక భాగం ఉంటుందా లేక కెజిఎఫ్ లాగా టూ పార్ట్స్ అనే సస్పెన్స్ తేలాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు ఆగాలి. ఆదిపురుష్ రామాయణం కథ కాబట్టి ఎక్కువ విమర్శలకు చోటు దక్కింది. కానీ సలార్ కి అలాంటి ఇబ్బందులేమీ లేవు. డిఫరెంట్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఆదిపురుష్ ఫైనల్ రన్ దగ్గరపడ్డాక సలార్ తాలూకు ప్రమోషన్లను టీజర్ తో మొదలుపెట్టబోతున్నారు
This post was last modified on June 19, 2023 1:16 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…