బాలీవుడ్లో కథలకు బాగా కరువొచ్చేసినట్లుంది. అక్కడ తయారయ్యే సినిమాల్లో సగం దక్షిణాది చిత్రాల రీమేక్‌లే ఉంటున్నాయి. ఇక్కడి కథల్ని తీసుకుని.. వాటికి బాలీవుడ్ టచ్ ఇచ్చి కొత్తగా తీర్చిదిద్ది అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలు మంచి ఫలితాలు కూడా అందుకుంటుండటంతో దక్షిణాది సినిమాల రీమేక్‌లు మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు నుంచి ‘జెర్సీ’ రీమేక్ అవుతుండగా.. ‘ఎఫ్-2’, ‘హిట్’ లాంటి సినిమాలు కూడా హిందీలోకి వెళ్తున్నాయి. ఐతే ఈ మధ్య వచ్చినవే కాక.. కొంచెం వెనక్కి వెళ్లి పాత సినిమాల్ని కూడా రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు వెనుకాడట్లేదు. ఈ కోవలోనే 12 ఏళ్ల కిందట వచ్చిన ‘వినాయకుడు’ సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం.
కమెడియన్ కృష్ణుడు ప్రధాన పాత్రలో అడివి శేష్ అన్నయ్య సాయికిరణ్ అడివి రూపొందించిన ‘వినాయకుడు’ అప్పట్లో మంచి విజయం సాధించింది. ‘బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ’ క్యాప్షన్‌తో వచ్చిన ఈ చిత్రంలో భారీకాయుడైన ఓ అబ్బాయి, అందమైన అమ్మాయి మధ్య ప్రేమను చాలా సరదాగా, హృద్యంగా చూపించారు. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో పాటు అవార్డులు కూడా గెలిచింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారట.
ఒరిజినల్ తీసిన సాయికిరణే హిందీ వెర్షన్‌కు కూడా దర్శకుడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించనుంది. రీమేక్ గురించి సాయికిరణే మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఇంకా నటీనటుల వివరాలు వెల్లడి కాలేదు. కృష్ణుడు కోసమే పుట్టినట్లు అనిపించే ఈ కథను బాలీవుడ్లో ఏ నటుడు చేస్తాడన్నది ఆసక్తికరం. కథకు తగ్గట్లు అతను భారీకాయుడై ఉండాలి. కాబట్టి ఓ కొత్త నటుడినే ఎంచుకునే అవకాశముంది.
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…