Movie News

హ‌వ్వ‌.. ఆదిపురుష్ రామాయ‌ణ క‌థ కాద‌ట‌

ఆదిపురుష్ సినిమా రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కింద‌ని అంద‌రికీ తెలుసు. మొద‌ట్నుంచి దీన్ని రామాయ‌ణం మీద సినిమాగానే ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో తాను రాముడి పాత్ర చేశాన‌ని ప్ర‌భాస్ స్వ‌యంగా వేదిక మీద చెప్పాడు. సినిమాలో జై శ్రీరామ్ జైశ్రీరామ్ అనే పాట ఉంది. కాక‌పోతే ప్ర‌ధాన పాత్ర‌ల‌కు రాముడు, సీత‌, హ‌నుమంతుడు, రావ‌ణుడు అని కాకుండా.. రాఘ‌వుడు, జాన‌కి, భ‌జ‌రంగ్, లంకేశ్వ‌రుడు అనే ఆయా పాత్ర‌లకున్న వేరే పేర్ల‌ను పెట్టారు.

రిలీజ్ రోజు వ‌ర‌కు ఈ సినిమాను రామాయ‌ణ గాథ‌గానే ప్ర‌చారం చేసి.. ఇప్పుడేమో ఉన్న‌ట్లుండి ఇది రామాయ‌ణం కాదు అంటూ ప్టేట్ మార్చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఆదిపురుష్ ర‌చ‌యితల్లో ఒక‌రైన మ‌నోజ్ ముంతాషిర్ శుక్లా ఒక టీవీ ఛానెల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆదిపురుష్ రిలీజ్ అయిన ద‌గ్గ‌ర్నుంచి ఇదేం రామాయ‌ణం.. రామాయ‌ణ గాథ‌ను ఇలాగేనా తీసేది.. రావ‌ణుడేంటి అలా ఉన్నాడు.. హ‌నుమంతుడి డైలాగ్స్ ఇంత దారుణ‌మా అంటూ ప్రేక్ష‌కులు చిత్ర బృందం మీద విరుచుకుప‌డుతున్నారు.

అనేక స‌న్నివేశాలు.. పాత్ర‌లు.. ఇత‌ర అంశాల మీద అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఒక టీవీ చానెల్ చ‌ర్చ‌లో యాంక‌ర్ ప్ర‌స్తావిస్తే.. ర‌చ‌యిత మ‌నోజ్ ముంతాషిర్ చిత్ర‌మైన వాద‌న చేశాడు. తాము రామాయ‌ణం నుంచి చాలా వ‌ర‌కు స్ఫూర్తి పొందిన మాట వాస్త‌వ‌మే అయినా.. తాము తీసింది మాత్రం రామాయ‌ణ క‌థ‌ను కాద‌ని.. ఇది క‌ల్పిత క‌థ అన్న‌ట్లుగా మాట్లాడాడు.

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రామాయ‌ణం పేరుతో జ‌నాల‌ను ఉద్వేగానికి గురి చేసి.. సినిమాను ఆ కోణంలోనే ప్ర‌చారం చేసుకుని.. హనుమంతుడి సీట్ అంటూ ప్ర‌చారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లి ఇప్పుడు ఇది రామాయ‌ణం కాదు అన‌డం ఏంటంటూ నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు చిత్ర బృందం మీద‌.

This post was last modified on June 18, 2023 10:06 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

5 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago