ఈ శుక్రవారం విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా మిక్స్డ్ టాక్‌తోనూ తొలి రోజు భారీ వసూళ్లే రాబట్టింది. ఐతే సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ రావడం వల్ల టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు వసూళ్లు వచ్చాయి. మరి రెండో రోజు ఏమవుతుందో చూడాలి. ఐతే సినిమా అంచనాలను అందుకోలేకపోయిందన్నది మాత్రం వాస్తవం. రామాయణ గాథలో బేసిగ్గా ఉన్న ఆకర్షణ వల్ల ఆ కథ మీద ఎన్ని సినిమాలు తీసినా జనం చూస్తారు.
ఇప్పుడు ఓం రౌత్ తన క్రియేటివిటీని హద్దుల్లో పెట్టుకుని ఓ మోస్తరుగా సినిమా తీసి ఉన్నా.. ఇన్ని విమర్శలు వచ్చేవి కావు. కానీ అతను మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. పాత్రల ఆహార్యం, గ్రాఫిక్స్, డైలాగుల విషయంలో టూమచ్ లిబర్టీ తీసుకుని సినిమాను చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. ఈ సినిమా చూసి ఎక్కువ ఫీలవుతున్నది తెలుగు ప్రేక్షకులే. ఎందుకంటే తెలుగులో వచ్చినన్ని అద్భుతమైన పౌరాణికాలు మరే భాషలోనూ రాలేదు.
రామాయణం మీద ఇండియాలో తెరకెక్కిన అద్భుతమైన సినిమాలన్నీ తెలుగు నుంచి వచ్చినవే. ముఖ్యంగా రాముడి మీద అమితమైన భక్తి ఉన్న బాపు-రమణ కలిసి.. రామాయణం ఆధారంగా గొప్ప కళాఖండాలను ఆవిష్కరించారు. వాటన్నింటిలో ‘సంపూర్ణ రామాయణం’ అల్టిమేట్ క్లాసిక్ అని చెప్పాలి. మళ్లీ బాపునే ‘సీతా కళ్యాణం’ లాంటి మరో క్లాసిక్ అందించాడు రామాయణం ఆధారంగా. ఇక బాపు అందించిన మరో క్లాసిక్.. ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. ఇక పౌరాణికాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్.. స్వీయ దర్శకత్వంలో ‘సీతారామ కళ్యాణం’ తీసి అబ్బురపరిచారు. ఆయనే ‘శ్రీరామ పట్టాభిషేకం’ లాంటి మరో గొప్ప సినిమాను అందించారు.
ఇక పుల్లయ్య తీసిన ‘లవకుశ’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక రావణుడి మీద ‘భూకైలాస్’.. ఆంజనేయుడి మీద ‘వీరాంజనేయ’. లాంటి మేటి చిత్రాలు వచ్చాయి తెలుగులో. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో రామాయణం మీద వచ్చిన క్లాసిక్స్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే అద్భుతమైన కథాకథనాలతో ప్రేక్షకులను అబ్బురపరరిచాయి. వాటిని ఇప్పుడు చూసినా గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాంటి క్లాసిక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులకు.. చాలా కృత్రిమంగా తయారైన ‘ఆదిపురుష్’ను చూస్తే కోపం రావడంలో ఆశ్చర్యం లేదు.
This post was last modified on June 17, 2023 10:36 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…