సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం షూటింగ్ తాలూకు ఆలస్యాల పర్వం ఎంతకీ తెగడం లేదు. సంవత్సరంలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోతున్నాయి. ఇంకో నూటా ఎనభై రోజులు మాత్రమే టైం ఉంది. 2024 జనవరి 13 విడుదలని అఫీషియల్ గా టీజర్ తో పాటుగా అనౌన్స్ చేశారు కాబట్టి ఇక వెనుకడుగు వేయడానికి లేదు. టీమ్ ఎంత పట్టుదలగా ఉన్నా ఆర్టిస్టుల డేట్లను సమన్వయం చేసుకోవడం టీమ్ కి పెద్ద సవాల్ గా మారిందట. టాప్ రేటెడ్ క్యాస్టింగ్ ఉండటమే దీనికి కారణం.
హీరో ఎంత అందుబాటులో ఉన్నా ఇతరులతో కాంబో ఉన్న షెడ్యూల్స్ కి వాళ్ళను టైంకి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. జయరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, జగపతి బాబు వీళ్లంతా మాములు బిజీగా లేరు. హఠాత్తుగా డేట్లు కావాలంటే దొరకరు. హీరోయిన్ పూజా హెగ్డేకూ కొత్త కమిట్ మెంట్స్ వస్తున్నాయి. ఇక శ్రీలీల సంగతి సరేసరి. ఒకేసారి దశావతారంలాగా గంప నిండా సినిమాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది. వీళ్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి లొకేషన్లు సెట్ చేసుకోవడం, పాటలు ప్లాన్ చేయడం ఇవన్నీ అంత సులభంగా తేలే వ్యవహారాలు కాదు.
ఇదంతా చూస్తుంటే గుంటూరు కారం సంక్రాంతికి రావడం పట్ల అనుమానం ఉందంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం మొదలయ్యింది. అయితే సితార సంస్థ మాత్రం ఈ విషయంలో పట్టుదల చూపిస్తోందట. బంగారం లాంటి సంక్రాంతి సీజన్ ని వదులుకోవడం ఇష్టం లేక ఎలాగైనా టార్గెట్ ని చేరుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఏదైనా వాయిదా అంటూ జరిగితే మాత్రం ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచేసుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడంతో పాటు కారం వేగంగా దంచేసి వంటకు సిద్ధం చేయాలి. తమన్ పాటల కంపోజింగ్ ఇంకా కొలిక్కి రాలేదని టాక్
This post was last modified on June 17, 2023 4:50 pm
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…