Movie News

హనుమాన్ సీట్లో కూర్చోన్నోడ్ని చితక్కొట్టారు

భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తున్న వైనం తెలిసిందే. అయితే.. మూవీ విడుదల సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాను చూసొచ్చి థియేటర్ బయట యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే వారిలో ఎవరైనా సినిమా బాగోలేదన్నంతనే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కనిపిస్తోంది. ఒకట్రెండు చోట్ల సినిమా బాగోలేదన్న మాట చెప్పిన వారిపై దాడి జరిగిన ఘటనలు ఇప్పటికే రిపోర్టు అయ్యాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి లోని భ్రమరాంబ థియేటర్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

ఆదిపురుష్ మూవీని ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్ లోనూ హనుమంతుల వారికి ఒక సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సీటు పక్కనే కూర్చొని సినిమా చూసేందుకు ప్రముఖులు నుంచి సామాన్యుల వరకు ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. మరికొందరు రికమండేషన్లతో హనుమంతుల వారికి కేటాయించిన సీటు పక్కన కూర్చొని సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భ్రమరాంబ థియేటర్ లో ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తి.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. దీనిపై కొందరుఅభ్యంతరం వ్యక్తం చేసినా.. అతడు స్పందించలేదు.

దీంతో.. అతడిపై కొందరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. థియేటర్ సిబ్బంది జోక్యం చేసుకొని.. హనుమంతుల వారికి కేటాయించిన సీట్లోకూర్చున్న వ్యక్తిని.. వేరే సీట్లోకి పంపారు. అయితే.. హనుమంతుల వారి సీట్లో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి సినిమాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. హనుమంతుల వారికి కేటాయించిన సీటును పరమ పవిత్రంగా భావిస్తూ.. సినిమాను చూస్తున్న ప్రేక్షకుల వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on June 17, 2023 11:24 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago