గత ఏడాది రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అంతా కంగారు పడ్డారు. ఓవైపు ‘రిపబ్లిక్’ సినిమా ఫ్లాప్ అయింది. మరోవైపు నెలల తరబడి తేజు ఆసుపత్రికి పరిమితం అయ్యాడు. కోలుకున్నాక కూడా అంత హుషారుగా కనిపించలేదు. దీంతో తేజు కెరీర్ మీద నీలి నీడలు కమ్ముకున్న సంకేతాలు కనిపించాయి. కానీ ‘విరూపాక్ష’ సినిమా ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది.
లో బజ్‌తో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయింది. ఈ వేసవిలో ఇదే టాలీవుడ్‌కు బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. దీని తర్వాత తేజ.. తన మావయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాకు మంచి హైపే ఉంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగానే.. తన తర్వాతి చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడతను. మాస్ డైరెక్టర్ సంపత్ నందితో తేజు సినిమా ఖరారైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘గోలీ శంకర్’ అనే మాస్ టైటిల్ పెడుతున్నారట ఈ చిత్రానికి. ‘గంజా శంకర్’ అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. ‘గంజా’ అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ‘గోలీ శంకర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
అదే రోజు టైటిల్ కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఊపుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఈ సినిమాను నిర్మించబోతోంది. ఆల్రెడీ తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో ‘ఆదికేశవ’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న సితార వాళ్లు.. ఇప్పుడు తేజుతో జట్టు కడుతున్నారు. సంపత్.. చివరగా గోపీచంద్‌తో తీసిన ‘సీటీమార్’ ఓ మోస్తరుగా ఆడింది. అతను గతంలో రామ్ చరణ్‌తో తీసిన ‘రచ్చ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తేజు చాన్నాళ్ల తర్వాత చేయనున్న పక్కా మాస్ మూవీ ఇదే.
This post was last modified on June 16, 2023 6:44 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…