పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్‌కు పెద్ద ఫ్యాన్ అయిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రెండు నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం.. వరుస షెడ్యూళ్లతో చకచకా షూటింగ్ జరుపుకుంది. కానీ ఇప్పుడు పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకోవడంతో మిగతా చిత్రాల్లాగే ‘ఓజీ’కి బ్రేక్ పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ చిత్ర బృందం మాత్రం ఆ ప్రచారానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. సినిమా కాస్టింగ్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. వారం కిందటే తమిళ నటుడు అర్జున్ దాస్ ‘ఓజీ’లో నటిస్తున్న విషయాన్ని ప్రకటించారు. తర్వాత ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు శ్రియారెడ్డి వెల్లడించింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. ‘ఓజీ’లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషించనున్నాడట. బాలీవుడ్ నటులు తెలుగులో విలన్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు.
ఈ మధ్య ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఐతే బాలీవుడ్లో ముద్దుల హీరోగా పేరుపడ్డ ఇమ్రాన్ హష్మిని ఇప్పటి వరకు ఎవరూ తెలుగు చిత్రాల కోసం సంప్రదించింది లేదు. సుజీత్ వైవిధ్యంగా ఆలోచించి అతణ్ని విలన్ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాడు. హిందీలో కూడా అతను కొన్ని నెగెటివ్ రోల్స్ చేశాడు. మరి పవన్ ముందు అతను ఎంత బలంగా నిలబడతాడన్నది ఆసక్తికరం. మలయాళ నటి ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
This post was last modified on June 15, 2023 9:44 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…