ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆన్ లైన్ హోరెత్తిపోతోంది. ఒక్క హైదరాబాద్ లోనే వెయ్యి షోలతో ఇప్పటికే ఏడు కోట్లకు పైగా వసూలైనట్టు ట్రేడ్ టాక్. ఇంకా స్క్రీన్లు షోలు పెరుగుతున్నాయి కాబట్టి ఫైనల్ కౌంట్ షాకింగ్ గా ఉండబోతోంది. సిటీలోనే ఇలా ఉంటే ఇక వరల్డ్ వైడ్ జరుగుతున్న ట్రెండింగ్ గురించి చెప్పేదేముంది. 7 వేలకు పైగా స్క్రీన్లతో వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు సర్వం సిద్ధమయ్యింది. టికెట్ల కోసం వస్తున్న ఒత్తిడితో మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కిందామీదా పడుతున్నాయి. అనూహ్యంగా త్రీడితో పోటీ పడుతూ టూడి అమ్మకాలు కూడా బాగున్నాయి
ఇక రాబడి అంచనాల విషయానికి వస్తే మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ చాలా తేలికగా కనిపిస్తోంది. ఈజీగా నూటా పాతిక కోట్లను లాగేస్తుందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. బిసి సెంటర్లు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో డైరెక్ట్ కౌంటర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే బుక్ మై షోలో కనిపించేది మాత్రమే ట్రెండ్ అనుకోవడానికి లేదు. సుమారు 260 కోట్ల బిజినెస్ చేసుకున్న ఆదిపురుష్ కు పాజిటివ్ టాక్ వస్తే ఆ మొత్తాన్ని రాబట్టుకోవడం మంచి నీళ్లు తాగినంత తేలిక. హిందీ తెలుగులో ఉన్నంత హైప్ తమిళనాడు మలయాళంలో లేకపోయినా టాక్ వచ్చాక సీన్ మారొచ్చు
మొత్తానికి బయ్యర్ల ఊహలకు మించి జరుగుతున్న టికెట్ అమ్మకాలు చూస్తుంటే మతులు పోతున్నాయి. అనూహ్యంగా ఆదివారం దాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. టాక్ ఎలా ఉంటుందో చూసుకోకుండా మూడు రోజుల తర్వాత కూడా ముందే టికెట్లు కొనడం చూస్తే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హిందీ వెర్షన్ సులభంగా పాతిక కోట్లు చేస్తుందని విశ్లేషకుల మాట. ఒక్క మలయాళం వెర్షన్ మాత్రమే కొంత స్లో ఉంది. ఆ రాష్ట్రంలో హిందూ మత ప్రాతినిధ్యం తక్కువ కాబట్టి ఆ ప్రభావం కొంత పడుతోంది. ఏది ఏమైనా మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్ కోసం బాక్సాఫీస్ రెడీ అవుతోంది
This post was last modified on June 16, 2023 8:50 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…