ఇప్పుడు ఇండియా అంతా ‘ఆదిపురుష్’ మేనియాతో ఊగిపోతోంది. ఒకప్పుడు సినిమా మీద అంతగా బజ్ లేదు కానీ.. రిలీజ్ ముంగిట మాత్రం హైప్ మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో ‘ఆదిపురుష్’ హిందీ వెర్షన్‌కు సంబంధించి వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కొంచెం లేటుగా మొదలైనప్పటికీ.. అమ్మకాలు మామూలుగా లేవు.
బుక్ మై షో, పేటీఎం యాప్స్ స్ట్రక్ అయ్యే రేంజిలో జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారు. ఇలా దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ‘ఆదిపురుష్’ కోసం జనం ఎగబడుతున్నారు. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తమిళ ప్రేక్షకులు కానీ, ట్రేడ్ వర్గాలు కానీ ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ముందు నుంచే సినిమాకు అక్కడ హైప్ లేదు. రిలీజ్ ముంగిట కూడా పరిస్థితి మెరుగుపడలేదు.
తమిళంలో ఈ వారం సరైన సినిమాలు లేకున్నా సరే.. ‘ఆదిపురుష్’కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఓవైపు హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ షోలన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. తమిళుల్లో చాలామంది రాముడిని.. ‘రామాయణం’ను వ్యతిరేకిస్తుంటారు. ఇందులో కరుణానిధి లాంటి వాళ్ల పాత్ర చాలా ఉంది.
దీనికి తోడు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తమిళేతర భాషల వాళ్లు పట్టించుకోలేదు. అలాంటపుడు తాము మాత్రం వేరే భాషల సినిమాలను ఎందుకు ఆదరించాలనుకున్నారో ఏమో తెలియదు. ‘బాహుబలి’ సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తర్వాతి కాలంలో తమిళ జనాలు చాలా రిగ్రెట్ అవుతూ.. ఆ సినిమాను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. ‘ఆదిపురుష్’ను కూడా ఇదే మైండ్ సెట్‌తో నిరాదరిస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on June 15, 2023 4:21 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…