కెరీర్ మొదలుపెట్టి దశాబ్దంన్నర దాటినా ఇంకా అవకాశాలకు లోటు లేకుండా చూసుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా నిన్న అర్ధరాత్రి నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆదిపురుష్ రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని శుక్రవారానికి బదులు గురువారమే ఈ రామ్ కామ్ సిరీస్ ని విడుదల చేశారు. దీని మీద ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి కలగడానికి కారణం తమన్నా బోల్డ్ షోనే. ట్రైలర్ లో ఓ సీన్ చూసి ఆడియన్స్ చాలానే ఊహించుకున్నారు. దానికి తగ్గట్టే ఒక పడకగది సీన్లో దాదాపు టాప్ లెస్ గా నటించిన తమ్మూని చూసి అభిమానులు సైతం షాకవుతున్నారు
ఇక స్టోరీ విషయానికి వస్తే పాఠశాల దశ నుంచే స్నేహితులుగా ఉన్న లావణ్య(తమన్నా), రిషబ్(సుహైల్)లు సహజీవనంలో ఉంటారు. ఓ వేడుక సందర్భంలో రిషి ఆమెకు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. తర్వాత వేరే ట్విస్టులుంటాయి. ఇది ఒక జంట కథ కాదు. లైఫ్ పార్ట్ నర్ కోసం వెతుకుతున్న ప్రీత్(అన్యసింగ్), మధ్యతరగతి ఇరుకు ఇంట్లో భర్తతో కనీస సుఖం లేదని బాధ పడే శీతల్(సంవేదన), ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న టైంలో పెళ్ళైన మహిళను ప్రేమించే షాహిద్(హుస్సేన్), బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ ని బయట పెట్టుకోలేని మెల్రాయ్(నయాన్) ఇలా లావణ్య స్కూల్ మేట్స్ అయినా వీళ్లందరి జీవితాల సమూహారం జీకర్దా.
దర్శకులు అరుణిమా శర్మ-హోమీ అదజనియాలు వర్తమానంలో యూత్ ఎదురుకుంటున్న సమస్యలను చర్చించే ప్రయత్నం చేసినప్పటికీ బోల్డ్ నెస్, విచ్చలవిడితనం ఎక్కువైపోవడంతో పాటు నిడివి విషయంలో జాగ్రత్తలు లేకపోవడం వల్ల జీ కర్దా అధిక శాతం బోరింగ్ గా సాగుతుంది. అన్నీ ఊహించినట్టే సాగుతాయి. చివరి మూడు ఎపిసోడ్లు ఫార్వార్డ్ బటన్ కు పని చెప్పక తప్పదనేలా ఉన్నాయి. ఆధునిక జీవితానికి ముంబై రైటర్లు ఇస్తున్న నిర్వచనాలకు దండం పెట్టాల్సిందే. ఎమోషన్లు కూడా అధిక శాతం కనెక్ట్ కాలేదు. మరీ ఖాళీ సమయం ఎక్కువగా ఉండి తమన్నా కోసం తప్ప జీ కర్దాని ఛాయస్ గా పెట్టుకోవడం కష్టమే
This post was last modified on June 15, 2023 2:35 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…