బాగా ఆలస్యమైనా సరే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి సంబందించిన అనుమతులు వచ్చేశాయి. పది రోజుల దాకా ప్రతి టికెట్ మీద 50 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని జిఓ జారీ చేశారు. అంటే జూన్ 25 వరకు ఇవి అమలులో ఉంటాయి. ఒకరకంగా తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ నిడివి ఇవ్వడం ఒక్కటే ఊరట. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిన వెంటనే ఆన్ లైన్ లో అమ్మకాలు మొదలుపెట్టేశారు. టికెట్లు సెకండ్లలో అమ్ముడుపోతున్నాయి. తొంభై శాతం ప్రభాస్ బొమ్మే ఉండగా మిగిలినవాటిలో ఫ్లాష్ వేస్తున్నారు
ఇదంతా బాగానే ఉంది కానీ బెనిఫిట్ షోల గురించి జిఓలో ప్రస్తావన లేదు. అంటే గరిష్టంగా అయిదు షోల కంటే ఎక్కువ వేసుకోవటానికి లేదు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ ఉదయం 4 లేదా 5 గంటలకు వేయాలంటే అది ఆరో షో అవుతుంది. మరి చివరి నిమిషంలో ఏమైనా స్పెషల్ కన్సెషన్ ఇచ్చి ఓకే అంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ అభిమానులు త్వరగా చూస్తూ ట్విట్టర్ లో వాటి తాలూకు అప్డేట్లు వీడియోలను పెడుతుంటే ఏపీ ఫ్యాన్స్ తట్టుకోగలరా. ఇప్పుడదే అసలు సమస్య.
కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోవడంతో టికెట్ల కోసం డిమాండ్ అంతకంతా పెరిగిపోతోంది. చాలా చోట్ల యాజమాన్యాలు కొంత శాతాన్ని ముందస్తుగా తమ వాళ్ళ కోసం బ్లాక్ చేసినా వస్తున్న ఒత్తిడికి అవి ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఖచ్చితంగా మొదటి రోజే చూడాలన్న ఆత్రం వల్ల వచ్చిన తిప్పలివి. ఆదివారం దాకా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం కనీసం మూడు వారాల పాటు ఆదిపురుష్ సునామి ఖచ్చితంగా ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఖాళీగా రోజులు వెళ్లదీస్తున్న థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడబోతున్నాయి
This post was last modified on June 14, 2023 10:23 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…