భోళా శంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాల్లో ఒకటి బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడితో అన్న సంగతి చాలా రోజుల క్రితమే లీకయ్యింది. అఫీషియల్ గా ఆగస్ట్ 22 మెగాస్టార్ పుట్టినరోజున ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన లీక్స్ కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. తన మొదటి సినిమా లాగే ఈసారి కూడా వశిష్ఠ ఫాంటసీ జానర్ నే ఎంచుకున్నారట. చిరు ఐకానిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఓ విజువల్ గ్రాండియర్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ముల్లోక వీరుడు టైటిల్ ని రిజిస్టర్ చేయించారని వినికిడి.
అసలు ట్విస్టు ఏంటంటే ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు కావాలట. ముల్లోకాల నుంచి వచ్చే అందాల భామలు హీరో కోసం సాగించే వేట కథలో కీలకమైన పాయింట్ గా ఉంటుందట. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేలా ఈ పాత్రలు ఉండకపోవడంతో ఇప్పుడు అంత మందిని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్. అసలు సీనియర్ హీరోలకు ఒక్క జోడీని కుదర్చడమే పద్మవ్యూహంలా మారుతోంది. అలాంటిది ఒకేసారి ఇందరిని తీసుకురావడమంటే మాములు రిస్క్ కాదు. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి పనుల్లో ఉన్న వశిష్ట మరోవైపు క్యాస్టింగ్ సంబందించిన వ్యవహారాలు చూస్తున్నాడట
అసలే టాలీవుడ్ పరిశ్రమ హీరోయిన్ల కొరతతో కిందామీదా పడుతోంది. ఇప్పటితరం స్టార్లకే పెద్దగా ఆప్షన్లు ఉండటం లేదు. అలాంటిది ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్న చిరు కోసం వెతికి పట్టుకోవడం భారీ టాస్క్. క్యాథరిన్ త్రెస్సా, రెజీనా, ఈషా రెబ్బ, మంజు వారియర్, అపర్ణబాలమురళి, సంయుక్త మీనన్, నిత్య మీనన్ లాంటివాళ్ళను సంప్రదించే ఆలోచనలో వశిష్ట ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్ల క్రితం అశ్వినిదత్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భూలోకవీరుడుని కొంత షూట్ చేసి ఆపేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ముల్లోకవీరుడు కుదురుతోంది
This post was last modified on June 14, 2023 2:11 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…