కొందరు హీరోయిన్లకు ఎంత టాలెంట్ ఉన్నా ఎందుకో కాలం అట్టే కలిసి రాదు. అందులో శ్రియ రెడ్డి ఒకరు. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2003లో రాజా సరసన అప్పుడప్పుడుతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది కానీ పెద్దగా అవకాశాలు అందుకోలేదు. తర్వాత శర్వానంద్ అమ్మ చెప్పిందిలో మంచి పాత్రే వేసినా ఫలితం దక్కలేదు. విశాల్ పొగరులో విలన్ గా అదరగొట్టాక ఆమె సత్తా ఏంటో అందరికి తెలిసింది. విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకుని తర్వాత వైవాహిక జీవితానికి అంకితమైపోయింది. ఆడపాదడపా నటించినా అంతగా గుర్తింపు రాలేదు.
ఆ మధ్య సుజల్ వెబ్ సిరీస్ తో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రేయ రెడ్డి తాజాగా డబుల్ జాక్ పాట్ కొట్టేసింది. ఆల్రెడీ ప్రభాస్ సలార్ లో తనో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారని టాక్ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఓజిలోనూ ఛాన్స్ కొట్టేసింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఓజిలో దర్శకుడు సుజిత్ శ్రేయ రెడ్డిని ఒక షాకింగ్ రోల్ లో చూపించబోతున్నట్టు వినికిడి. పాత్ర తాలూకు తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెప్పలేదు కానీ మొత్తానికి ఆవిడ మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతోంది.
ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరికైనా అంతేగా. ఒకవేళ సలార్, ఓజి రెండు హిట్టయితే ఇక్కడే సెకండ్ ఇన్నింగ్స్ ని సెట్ చేసుకోవచ్చు. హీరోయిన్ గా కాకపోయినా ఆషామాషీ అక్క వదిన పాత్రలు ఎలాగూ చేయదు కాబట్టి వెయిట్ ఉన్న వాటినే దర్శకులు ఆఫర్ చేస్తారు. గ్లామర్ స్కిన్ టోన్ లేకపోయినా నటన విషయంలో ఎవరికీ తీసిపోని శ్రేయరెడ్డికి తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది. విజెగా కెరీర్ మొదలుపెట్టి నటిగా సెటిలయ్యే క్రమంలో ఎందుకనో వేగంగా చాన్సులు పట్టేయలేకపోయింది. సరే ఆలస్యమైనా సరే క్రేజీ ఆఫర్లైతే వస్తున్నాయి కాబట్టి వాటిని వాడుకోవడమే ఆలస్యం
This post was last modified on June 13, 2023 5:10 pm
‘పుష్ప...పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్...’ అంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి దేశమంతా ‘పుష్ప’ ఫీవర్ వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. సామాన్యుల…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు 'ఫార్ములా ఈ - రేస్' ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే…
పేద్ద గన్ పట్టుకుని.. ఆరు అడుగుల ఎత్తుతో చూడగానే నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్న ఈ అధికారి.. ఐపీఎస్…
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్...ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ…
కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్…