సాధారణంగా భారీ సినిమాల నిర్మాతలు తమ బడ్జెట్ ఎంతయ్యిందో ఓపెన్ గా చెప్పరు. మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా స్పందించడం కానీ ఖండించడం కానీ ఏదీ చేయరు. దీంతో అభిమానులు ట్రేడ్ వర్గాలు ఎవరికి వారు తమ తమ ఫిగర్లను సర్కులేషన్ లోకి తెస్తారు. కానీ ఆదిపురుష్ తెలుగు హక్కులు కొన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ ఓపెన్ గా 165 కోట్లకు కొనుగోలు జరిగిందని జిఎస్టి కలుపుకుంటే ఫైనల్ గా 185 కోట్లకు చేరుకుందని బాహాటంగా చెప్పేశారు. టి సిరీస్ తో తమకున్న అండర్ స్టాండింగ్ వల్లే ఇది సాధ్యమయ్యిందనే మాట కూడా అన్నారు
ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు రావాలంటే రెండు వందల కోట్లు ఏపీ తెలంగాణ నుంచే రావాలి. ప్రస్తుతం ఉన్న బజ్ కి బ్లాక్ బస్టర్ టాక్ తోడైతే అదేమీ అసాధ్యం కాదు. ఎలాగూ పోటీ లేదు. దాదాపు థియేటర్లన్నీ ప్రభాస్ కే వచ్చేస్తాయి. ప్రతి ఊళ్ళో ప్రతి స్క్రీన్ లో ఈ సినిమానే వేసేందుకు బయ్యర్లు సిద్ధమవుతున్నారు. డిమాండ్ కూడా దానికి తగ్గట్టే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి విపరీతమైన ఒత్తిడి ఉంది. పర్మిషన్ల వల్ల ఆన్ లైన్ బుకింగ్ కొంత ఆలస్యమైనప్పటికీ అందుబాటులోకి రావడం ఆలస్యం క్షణాల్లో హాట్ కేక్స్ లా అమ్ముడుపోవడం ఖాయం.
వీకెండ్ మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇదొకకే కాదు ప్రభాస్ మరో సినిమా స్పిరిట్ కూడా తామే కొన్నామని క్లారిటీ ఇచ్చారు. మారుతీ దర్శకత్వంలో డార్లింగ్ తో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీని నిర్మాణంలో ఉంచిన పీపుల్స్ మీడియా మొత్తం మూడు ప్రభాస్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. టాప్ బ్యానర్ గా నిలవడానికి వరస ప్రాజెక్టులు చేస్తున్న విశ్వప్రసాద్ తమ నిర్మాణ సంస్థను మైత్రికి ధీటుగా నిలబెట్టేందుకు భారీ ప్రణాళికలు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తొలి కలయికలో రూపొందుతున్న బ్రో మీద ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది.
This post was last modified on June 13, 2023 4:06 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…