Movie News

అభిమానుల స్పందనకు షాక్ తిన్న కియారా

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కియారా అద్వానీకి మంచి ఫాలోయింగే ఉంది. మహేష్ బాబుతో భరత్ అనే నేనుతో డెబ్యూనే సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో డిజాస్టర్ అందుకున్నాక పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైపోయింది. ఆమె తాజా మూవీ సత్యప్రేమ్ కి కథ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ట్రైలర్ వచ్చాక దీని మీద పాజిటివ్ హైప్ పెరిగింది. టూ ఝూటి మై మక్కర్, జర హట్కె జర బచ్కె లాంటి యావరేజ్ రామ్ కామ్స్ సైతం బాలీవుడ్ లో బాగా ఆడుతున్న టైంలో ఇది కనక సరిగ్గా మెప్పిస్తే భారీ వసూళ్లు వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు

దీని ప్రమోషన్లో భాగంగా ఇటీవలే కియారా అద్వానీ ఈ చిత్రం హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి పెళ్లి సీన్ తాలూకు పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన నిజ జీవిత భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో జరిగిన వివాహ వేడుకలోని ఒక ఐకానిక్ మూమెంట్ ని మళ్ళీ రీ క్రియేట్ చేసింది. దీన్ని ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు. జీవితంలో అరుదుగా వచ్చే కొన్ని క్షణాలను మన కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయాలని, కేవలం మూవీ పబ్లిసిటీ కోసం ఇలా చేయడం వల్ల బయటి వాళ్ళు ఇటు కార్తీక్ అటు సిద్దార్థ్ ఇద్దరూ హీరోలే తప్ప లైఫ్ పార్ట్ నర్ ఎవరో అర్థం చేసుకోలేరని అంటున్నారు

ఇందులో లాజిక్ ఉంది. దెబ్బకు కియారా ఆ పిక్ ని తీసేసి సైలెంట్ అయిపోయింది. అభిమానులు అన్నదాంట్లో న్యాయం ఉంది. ఓ పదేళ్ల తర్వాత రెండు ఫోటోలు పక్కనపెట్టి కియారా భర్త ఎవరో గుర్తు పట్టమంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం కావొచ్చు. రెండు స్టిల్స్ ఒకేలా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ రావడం సహజం.  ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్న కియారా దర్శకుడు శంకర్ ఇండియన్ 2లో బిజీగా ఉండటం వల్ల బ్రేక్ తీసుకుని హిందీ షూటింగ్స్ కి డేట్స్ ఇచ్చేసింది. తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వెళ్తున్నా అమ్మడు మాత్రం అంత సులభంగా ఒప్పుకోవడం లేదు

This post was last modified on June 13, 2023 12:09 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

56 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago