దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. పుష్కరం కిందటే ఉంటుందనుకున్న ఈ చిత్రం.. చాలా ఆలస్యంగా రెండేళ్ల కిందటే ఖరారైంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఆ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉండి మహేష్ సినిమా పని మొదలుపెట్టలేదు జక్కన్న. కొన్ని నెలల కిందటే ఈ సినిమా స్క్రిప్టు పనులతో పాటు ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
ప్రస్తుతం రాజమౌళి పూర్తిగా ఆ ప్రాజెక్టు మీదే తన దృష్టిని కేంద్రీకరించాడు. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. కానీ ఈ చిత్రానికి ముహూర్త వేడుకను మాత్రం త్వరలోనే నిర్వహించబోతున్నట్లు సమాచారం.
రాబోయే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ప్రారంభోత్సవం నిర్వహించాలని చూస్తున్నారట. ఆ రోజు లాంఛనంగా సినిమాకు ముహూర్త వేడుక నిర్వహించి.. స్క్రిప్టు పక్కాగా ఎప్పుడు రెడీ అవుతుంది, ప్రి ప్రొడక్షన్ పనులంతా ఎప్పటికి పూర్తవుతాయి అన్నదాన్ని బట్టి వచ్చే ఏడాది షూట్ మొదలుపెడతారని సమాచారం.
ఐతే తన సినిమాల ముహూర్త వేడుకలకు మహేష్ హాజరై చాలా ఏళ్లయింది. అది అతడికి సెంటిమెంటుగా మారింది. మహేష్ లేకుండానే ఈ వేడుకలు పూర్తి చేస్తుంటారు. త్రివిక్రమ్‌తో తన కొత్త సినిమా గుంటూరు కారం విషయంలోనూ ఇదే ఒరవడిని కొనసాగించాడు. కానీ రాజమౌళి సినిమా అంటే చాలా స్పెషల్ కాబట్టి దీని వేడుకకు మహేస్ వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటారనడంలో సందేహం లేదు. మరోవైపు తన పుట్టిన రోజులకు వెకేషన్‌కు వెళ్లే అలవాటు కూడా మహేష్‌కు ఉంది. మరి సెంటిమెంట్ బ్రేక్ చేసి రాజమౌళి సినిమా వేడుకలో మహేష్ పాల్గొంటాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on June 12, 2023 11:57 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…