Movie News

2024 సంక్రాంతి సినిమాల‌పై ఉత్కంఠ‌

టాలీవుడ్లో చాలా ముందుగా బెర్తులు బుక్ అయిపోయే సీజ‌న్ అంటే సంక్రాంతే. ఆ సీజ‌న్లో సినిమాలు చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు, అప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల‌కు వ‌సూళ్ల మోత మోగిపోతుంది కాబ‌ట్టి.. దానికి అంత క్రేజ్. ఐదారు నెల‌ల ముందే దాదాపుగా సంక్రాంతి బెర్తుల‌న్నీ ఫిల్ అయిపోతుంటాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సీజ‌న్‌కు కూడా గ‌ట్టి పోటీనే ఉండేలా ఉంది. కాక‌పోతే ఆ పండ‌క్కి ప‌క్కాగా వ‌చ్చే సినిమాలు ఏవి అనే విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది.

ముందు ఈ సీజ‌న్‌కు ఖ‌రారైన సినిమా ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ప్రాజెక్ట్ కే. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల గుంటూరు కారంను అదే పండ‌క్కి షెడ్యూల్ చేశారు. కానీ ప్రాజెక్ట్ కే అనుకున్న ప్ర‌కారం రిలీజ్ కాక‌పోవ‌చ్చ‌ని.. వేస‌వికి వాయిదా ప‌డొచ్చ‌ని అంటున్నారు. అందుకేనేమో కొత్త‌గా సంక్రాంతి రేసులోకి వేరే సినిమాలు వ‌స్తున్నట్లున్నాయి. తాజాగా మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఈగ‌ల్‌ను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్న పీపుల్స్ మీడియా అధినేత‌లు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా  ఇది.

ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాద‌నే స‌మాచారంతోనే వాళ్లు ఈగ‌ల్‌ను పండ‌క్కి షెడ్యూల్ చేసిన‌ట్లున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, ఓజీల్లో ఒక‌దాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. ప‌వ‌న్ సినిమా ఒక‌టి ఖ‌రారైతే.. మ‌హేష్ మూవీ కూడా పండ‌క్కి ప‌క్కాగా వ‌చ్చేట్ల‌యితే సంక్రాంతి బెర్తులు ఫుల్ అయిపోయిన‌ట్లే. ఇంకో సినిమాకు అవ‌కాశం లేక‌పోవ‌చ్చు. ఐతే త‌మిళ సినిమా ఇండియ‌న్-2 డ‌బ్బింగ్ వెర్ష‌న్ కూడా సంక్రాంతికే వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

This post was last modified on June 12, 2023 11:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago