టాలీవుడ్లో కామెడీ వేషాలతో మంచి పేరు సంపాదించాడు ప్రభాస్ శీను. కొన్ని సినిమాల్లో విలన్ వేషాలతో కూడా అతను మెప్పించాడు. ఇండస్ట్రీలో చాలామంది శీనులు ఉండటంతో.. ప్రభాస్‌కు ఆప్త మిత్రుడు కావడంతో ఆ పేరునే తన పేరు ముందు పెట్టుకుని అలాగే పాపులర్ అయ్యాడతను. ఈ కమెడియన్‌కి సీనియర్ నటి తులసితో ఉన్న అనుబంధం గురించి రకరకాల వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో.
వీళ్లిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం.. కలిసి కనిపించడంతో వీరి బంధం ఏంటో జనాలకు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వీళ్ల గురించి రకరకాలుగా మాట్లాడేశారు. ఇద్దరి మధ్య వయసు అంతరం చాలా ఉండటంతో వీళ్లు స్నేహితులు ఎలా అయ్యారో అన్న చర్చ కూడా నడిచింది. ఐతే తమ బంధం గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శీను స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. తులసి తనకు తల్లితో సమానం అని అతను పేర్కొన్నాడు.
‘‘తులసి గారితో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ మా మీద మీడియా రకరకాలుగా వార్తలు రాసేసింది. ఆవిడ నాకు తల్లితో సమానం. ‘డార్లింగ్’ సినిమా సమయంలో ఆవిడతో పరిచయం జరిగింది. ఆ సమయంలో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. తులసి గారు పెద్ద నటి. ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. ఒకసారి ఏదో సరదాగా నన్ను డార్లింగ్ అని పిలిచిందని చాలా అపార్థం చేసుకున్నారు.
మాపై రూమర్లు వచ్చినపుడు ఆవిడే నాకు మెసేజ్ పెట్టారు. ‘‘ఇలా రాశారు. మీ ఆవిడకి చెప్పు. లేదంటే తను అపార్థం చేసుకుంటుంది’’ అని మెసేజ్ చేశారు. నా భార్య డాక్టర్. ఇలాంటి వార్తలను మేం నవ్వుకుని వదిలేస్తుంటాం. తులసి గారంటే నాకు ఎంతో గౌరవం. ఆమె ఎప్పుడూ పూజలు, పునస్కారాలకు సంబంధించిన మెసేజ్‌లే పెడుతుంటారు నాకు’’ అని ప్రభాస్ శీను క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on June 12, 2023 6:16 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…