Movie News

హరీష్‌ రావుకు రాజమౌళి.. రాజమౌళికి హరీష్ రావు

దర్శక ధీరుడు రాజమౌళి.. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒక కార్యక్రమంలో కలిసిన సందర్భంగా స్టేజ్ మీద ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. బంజారా హిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమౌళి, హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి.. హరీష్ రావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకసారి హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించానని.. ఈ క్రమంలో హరీష్ రావు నియోజకవర్గం అయిన సిద్దిపేట మీదుగా వెళ్లినట్లు హరీష్ తెలిపాడు. ముందున్న నియోజకవర్గాన్ని దాటి.. హరీష్ రావు నియోజకవర్గంలో అడుగు పెట్టగానే స్పష్టమైన మార్పు కనిపించిందని.. ఆ నియోజకవర్గాన్ని అంత బాగా హరీష్ రావు అభివృద్ధి చేశారని.. అప్పట్నుంచి తాను హరీష్ రావుకు అభిమానిగా మారానని రాజమౌళి తెలిపాడు.

అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గొప్పదనం గురించి ప్రస్తావించారు. రాజమౌళి గొప్ప దర్శకుడని.. ఆయన సినిమాలకు తాను అభిమానినని హరీష్ అన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. అలాగే జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించేలా ఆయన సినిమాలు ఉంటాయని.. కమర్షియల్ సక్సెస్ అవుతూనే అంతర్లీనంగా మంచి విషయాలు చెబుతారని హరీష్ రావు కొనియాడారు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మార్మోగేలా చేశారని.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా కీర్తి ప్రపంచ స్థాయికి చేర్చారని హరీష్ రావు అన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను తాను అనేకసార్లు కలిశానని.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని.. తాము ఆరంభించిన ఒక ఆసుపత్రి బాధ్యతను విజయేంద్ర ప్రసాద్, తన స్నేహితుడితో కలిసి తీసుకుని.. అందులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారని హరీష్ రావు తెలిపారు. రాజమౌళి కూడా తండ్రి బాటలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.., ఆయన వారసత్వాన్ని కూతురు కొనసాగిస్తోందని కొనియాడారు.

This post was last modified on June 12, 2023 4:35 pm

Share

Recent Posts

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

16 minutes ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

1 hour ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

2 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

6 hours ago

గొప్ప నిర్ణ‌యం: ఏపీలోనే విదేశీ విద్య‌!

ప్ర‌స్తుతం విదేశీ విద్య‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్‌, ర‌ష్యా స‌హా..…

9 hours ago

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

10 hours ago