ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న చిత్రాల్లో యానిమల్ ఒకటి. అర్జున్ రెడ్డి, దాని హిందీ వెర్షన్ కబీర్ సింగ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న చిత్రమిది. బాలీవుడ్ స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ లీడ్ రోల్ చేస్తుండటం.. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో ఎంతో ఆకర్షణీయంగా ఉండటం సినిమా మీద అంచనాలను పెంచింది.
తాజాగా విడుదలైన యానిమల్ ప్రి టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. కొరియన్ కల్ట్ మూవీ ఓల్డ్ బాయ్‌లో ఒక యాక్షన్ ఎపిసోడ్ స్ఫూర్తితో తీసినట్లుగా కనిపించిన ఈ ప్రి టీజర్ యునీక్‌గా అనిపించింది. సినిమా చాలా వయొలెంట్‌గా ఉండబోతోందన్న సంకేతాలను ఈ వీడియో గ్లింప్స్ ఇచ్చింది. కాగా ఈ వీడియోలో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఒక విషయం ఉంది.
యానిమల్‌ను అందరూ బేసిగ్గా హిందీ సినిమాగానే భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరో బాలీవుడ్ స్టార్. చాలా వరకు ముఖ్య పాత్రలను బాలీవుడ్ వాళ్లే పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది కూడా బాలీవుడ్ నిర్మాణ సంస్థే. ఐతే సందీప్ మాత్రం తాను తెలుగువాడిని కావడం, తనకు బ్రేక్ ఇచ్చింది కూడా తెలుగు సినీ పరిశ్రమే కావడంతో ఈ సినిమా ప్రోమోల్లో తెలుగుకే ప్రయారిటీ ఇస్తున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో అయిదు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. ప్రోమోల్లో హిందీ కంటే ముందు తెలుగు పేరు ముందు ఉండేలా చూసుకుంటున్నాడు సందీప్. తద్వారా తన ప్రాధాన్యం ముందు తెలుగుకే అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీదా సందీప్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా యానిమల్ సినిమా వాయిదా పడొచ్చన్న ప్రచారానికి సందీప్ తెరదించాడు. ఆగస్టు 11నే సినిమా రిలీజవుతుందని ప్రి టీజర్లో ప్రకటించారు.
This post was last modified on June 11, 2023 11:39 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…