‘తొలి వలపు’ లాంటి ఫ్లాప్ మూవీతో హీరోగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత గోపీచంద్ కెరీర్ మంచి మలుపులే తిరిగింది. జయం, వర్షం, నిజం చిత్రాలతో విలన్‌గా మెప్పించి.. ‘యజ్ఞం’ చిత్రంతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడతను. ఆ తర్వాత కెరీర్ తొలి పదేళ్లలో అతడికి మంచి మంచి హిట్లే పడ్డాయి. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం గోపీ పరిస్థితి దారుణంగా తయారైంది.
‘లౌక్యం’ మినహాయిస్తే అతడికి హిట్టే లేదు. ఆ సినిమా వచ్చి కూడా చాలా ఏళ్లయిపోయింది. గత కొన్నేళ్లలో డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తింటున్నాడు గోపీ. చివరగా అతడి నుంచి వచ్చిన ‘రామబాణం’ మీద ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి కరవైంది. ట్రైలర్ చూసే ఈ సినిమా ఆడదని ఒక నిర్ణయానికి వచ్చేశారందరూ. అందుకే దీనికి ఓపెనింగ్స్ కూడా కరవయ్యాయి. అతి తక్కువ అంచనాలతో వెళ్లినా సరే సిినిమా తీవ్ర నిరాశకు గురి చేయడంతో బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది.
‘రామబాణం’ రిజల్ట్ చూశాక గోపీ కెరీర్ క్లోజ్ అనే ఫీలింగ్ కలిగింది అందరికీ. ఇలాంటి సినిమాలు చేయడం కన్నా సైలెంటుగా ఉండటం మేలు అన్న అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమైంది. ఐతే ఒకప్పుడు మంచి విజయాలందుకున్న ఏ హీరో అయినా ఇలా ప్రయత్నం ఆపేసి కూర్చోడు. గోపీ మీద ఇంకా కొందరు నిర్మాతలకు నమ్మకం ఉంది.
అందులో ఒకరైన కేకే రాధామోహన్.. గోపీతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు గోపీ హీరోగా ‘గౌతమ్ నంద’ ప్రొడ్యూస్ చేశాడు రాధామోహన్. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయినప్పటికీ.. గోపీ ఫిల్మోగ్రఫీలో వైవిధ్యమైన, ఒక స్పెషల్ ఫిలింగా నిలిచింది. రాధామోహన్‌కు అప్పుడే ఇంకో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు గోపీ. ఇప్పుడు గోపీ కష్టాల్లో ఉండగా వీళ్ల కలయికలో సినిమా సెట్ అయింది.
ఈ చిత్రంతో కన్నడ దర్శకుడు హర్ష తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. కన్నడలో టాప్ స్టార్ శివరాజ్ కుమార్‌తో ‘వేద’ అనే బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడతను. ఇప్పుడు గోపీ కెరీర్‌ను పైకి లేపే భారాన్ని అతడి మీదే పెట్టారు. ఈ సినిమా ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జూన్ 12న మధ్యాహ్నం 12.29కి ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయనున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.
This post was last modified on June 11, 2023 10:06 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…