ఎవరేమనుకుంటే నాకేంటి.. నేనేం చేయాలనుకుంటే అది చేస్తా అన్నట్లు సాగిపోతుంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా తీసినా.. ట్వీట్ వేసినా.. టీవీ ఛానెల్లో కూర్చుని మాట్లాడినా ఆయన శైలి ఇలాగే ఉంటుంది. ఐతే ఈ మధ్య ఆయన మరీ శ్రుతి మించిపోతున్న అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి.. సినిమాలు తీసేస్తున్నాడు.
అలాగే ట్విట్టర్లో కూడా ఆయన కామెంట్లు హద్దులు దాటిపోతున్నాయి. మరీ పోర్న్-సెమీ పోర్న్ స్థాయికి దిగిపోయి ఆయన తీస్తున్న సినిమాలు ఎంత నాసిరకంగా ఉంటున్నాయో తెలిసిందే. ఆ కోవలోనే చేరేలా కనిపిస్తోంది ‘క్లైమాక్స్’. ఈ సినిమాతో అప్సరా రాణి అనే అమ్మాయిని లైమ్ లైట్లోకి తెచ్చాడు వర్మ.
ఆమెను అదే పనిగా ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. ఈ క్రమంలో తన అందం గురించి తనదైన శైలిలో అతిశయోక్తి మాటలు మాట్లాడుతున్నాడు. తాజాగా తన ఆరోగ్యం గురించి దుష్ప్రచారం జరుగుతుండటంతో వర్మ.. అదంతా అబద్ధం అంటూ తాను ఎంత ఫిట్‌గా ఉన్నది చూపిస్తూ డంబుల్స్ ఎత్తి బైసెప్స్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. దానికి అప్సరారాణి స్పందిస్తూ వర్మ బైసెప్స్ సూపరని, ఆయన సూపర్ ఫిట్‌గా ఉన్నాడని కాంప్లెమెంట్ ఇచ్చింది.
దీనికి వర్మ బదులిస్తూ.. నా బైసెప్స్ సంగతి పక్కన పెట్టు.. నీ ఒంట్లో అందాల గురించి మాట్లాడదాం అంటూ.. ఆమె అణువణువునూ వర్ణించే ప్రయత్నం చేశాడు. బట్టలు కప్పేసిన తన అందాలు అద్భుతం అన్నాడు. వర్మ నుంచి ఇవి ఆశ్చర్యకరమైన మాటలేమీ కావు కానీ.. మరీ వాట్సాప్ చాట్‌లో మాట్లాడాల్సిన మాటల్ని.. ఇలా ట్విట్టర్లో పెట్టేయడంతో నెటిజన్లు ఆయన్ని కౌంటర్ చేస్తున్నారు. కొంచెం కంట్రోల్లో ఉండమని ఆయనకు సలహాలిస్తున్నారు.
This post was last modified on August 10, 2020 6:17 pm
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…