Movie News

సమంతా మళ్ళీ టార్గెట్ అయ్యింది

చైతుతో విడాకుల వ్యవహారం ముగిశాక కెరీర్ ని ఇంకా సీరియస్ గా ప్లాన్ చేసుకుంటున్న సమంతాకు ఇటీవలే శాకుంతలం ఇచ్చిన షాక్ మామూలుది కాదు. సాక్ష్యాత్తు నిర్మాత దిల్ రాజే తన పాతికేళ్ల కెరీర్ లో ఇంత పెద్ద డిజాస్టర్ లేదని ఇంటర్వ్యూ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరే ఇలాంటివి అందరికీ సహజమే కాబట్టి ఆ ఫలితాన్ని సామ్ లైట్ తీసుకుని విదేశాలకు వెళ్లిపోయింది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సైబీరియాలో ఉన్న సమంతా అక్కడ ఓ పబ్బులో హుషారుగా పుష్పలో ఊ అంటావా ఉహు అంటావా పాటకు డాన్సు చేస్తున్న వీడియో ట్విట్టర్, ఇన్స్ టాలో బాగా వైరల్ అయ్యింది

ఇక్కడే తన యాంటీ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. యశోద, శాకుంతలం ప్రమోషన్లలో పదే పదే జబ్బు గురించి ప్రస్తావించి సానుభూతి కార్డు ప్లే చేసిన సామ్ హఠాత్తుగా ఫారిన్ వెళ్ళగానే హుషారుగా చలాకీగా మారిపోవడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని ట్రోల్స్ మొదలుపెట్టారు. తన సినిమాలను జనాలు థియేటర్లకు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రతిసారి సింపతీ కార్డు ప్లే చేయడం వర్కౌట్ కాదని ఈ సందర్భంగా చురకలు వేస్తున్నారు. నిజానికి సమంత రికవర్ అయ్యింది. కానీ శాకుంతలం టైంలో మాత్రం నీరసంగా, కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇబ్బందిగా కనిపించింది

రోజుల వ్యవధిలోనే సిటాడెల్ చిత్రీకరణలో అలాంటి సమస్యేమీ లేకుండా ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అయినా సామ్ ఎలాగూ సెప్టెంబర్ లో విడుదల కాబోయే విజయ్ దేవరకొండ ఖుషి ప్రమోషన్ల కోసం తిరిగి హైదరాబాద్ రావాల్సిందే. అప్పుడైనా ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. పైన చెప్పిన యాంటీ అభిమానులకు సమాధానాలు వస్తాయని సామ్ సపోర్టర్స్ మద్దతుగా నిలుస్తున్నారు. సిటాడెల్ హాలీవుడ్ వెర్షన్ ఫెయిలైన నేపథ్యంలో ఇండియన్ రీమేక్ ని రాజ్ అండ్ డికె ఎలా తీసుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. చూడాలి మరి ఏం చేస్తుందో 

This post was last modified on June 11, 2023 2:48 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

51 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago