వేసవి అంటే థియేటర్లకు పండగ అన్నట్లే ఉంటుంది మామూలుగా. ఆ సమయంలో థియేటర్లను కళకళలాడించే సినిమాలు వస్తుంటాయి. ప్రతి సమ్మర్లోనూ పెద్ద హీరోల సినిమాలు మూడు నాలుగు దాకా రిలీజవుతుంటాయి. కరోనా టైంలో తప్ప ఎప్పుడూ ఆ ఆనవాయితీ తప్పలేదు. కానీ ఈ ఏడాది అనూహ్యంగా వేసవి బరిలో ఉన్న పెద్ద సినిమాలన్నీ తప్పుకున్నాయి.
ఒక్కటంటే ఒక్క భారీ చిత్రం కూడా రిలీజ్ కాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడా భారీ చిత్రాల సందడి లేదు. తెలుగులో దసరా, విరూపాక్ష సినిమాలు మినహాయిస్తే థియేటర్లలో సందడి తెచ్చిన సినిమాలు పెద్దగా లేవు. గత నెల రోజుల్లో అయితే బాక్సాఫీస్ పరిస్థితి దారుణంగా తయారైంది.
ప్రతివారం చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. ఒక్కటీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లేదు. థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా డబ్బులు కూడా రాని పరిస్థితి. చాలా వరకు థియేటర్లను నష్టాలతో నడపాల్సిన పరిస్థితి. సినిమాలను ఆడించడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ వారం రిలీజైన టక్కర్, విమానం, అన్‌స్టాపబుల్, ఇంటింటి రామాయణం.. ఇవేవీ కూడా థియేటర్లలో సందడి తీసుకురాలేకపోయాయి.
ఒక్క సినిమా థియేటర్లోనూ పావు వంతు జనాలు కూడా లేరు. పది ఇరవై మందితో షోలు ఆడించాల్సిన పరిస్థితి. ఎటు చూసినా ఖాళీ సీట్లే దర్శనమిచ్చాయి. ఐతే ప్రతి థియేటర్లోనూ నెక్స్ట్ రిలీజ్ అంటూ ‘ఆదిపురుష్’ పోస్టరే కనిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో బయట డిస్ప్లే బోర్డులు, స్క్రీన్లు అన్నింట్లోనూ ‘ఆదిపురుష్’ ప్రోమోలే కనిపిస్తున్నాయి. లోపల ఖాళీ సీట్లు.. బయట వెలవెలబోతున్న క్యాంటీన్లు.. అన్నీ కూడా ఎదురు చూస్తున్నది ‘ఆదిపురుష్’ కోసమే. ప్రేక్షకుల ఆశలు, అంచనాలు కూడా ఆ చిత్రం మీదే ఉన్నాయి. ఇలా అందరూ ‘ఆదిపురుష్’ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వచ్చే వారం ప్రభాస్ బాక్సాఫీస్ విధ్వంసం చూడబోతున్నట్లే.
This post was last modified on June 10, 2023 7:31 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…