టాలీవుడ్లో రాజమౌళిది ఎవ్వరూ అందుకోలేని సెపరేట్ లీగ్ అయితే.. ఆ తర్వాతి లీగ్‌లో త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు ఉంటారు. ఇంతకుముందు ఈ లీగ్‌లో ఉన్న వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్.. దారుణమైన ఫెయిల్యూర్లతో అందులోంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీళ్లతో టాప్ హీరోలు ఇప్పుడు సినిమాలు చేసే పరిస్థితి లేదు. కొరటాల శివ చాలా తక్కువ సమయంలోనే ఈ లీగ్‌లో చోటు సంపాదించాడు. సురేందర్ రెడ్డి సైతం ఈ లీగ్‌లోనే ఉన్నాడు కానీ.. ‘ఏజెంట్’ మూవీతో అతను కూడా వైదొలిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక అనిల్ రావిపూడి ఎప్పట్నుంచో ఈ టాప్ లీగ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడవుతాడని అనిల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడ్డప్పటికీ.. ఒక అగ్ర కథానాయకుడిని సరిగా డీల్ చేయలేకపోయాడని.. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడని అభిప్రాయాలు వినిపించాయి.
ఐతే నందమూరి బాలకృష్ణతో ఇప్పుడు అనిల్ చేస్తున్న ‘భగవంత్ కేసరి’ టీజర్ చూశాక అతను పైన చెప్పుకున్న టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడైపోతాడన్న అంచనాలు కలుగుతున్నాయి. అనిల్ అంటే ఇప్పటికీ కామెడీ డైరెక్టర్ అనే ముద్రే ఉంది కానీ.. ‘భగవంత్ కేసరి’లో మాత్రం అతను అసలైన మాస్ చూపించాడు. టీజర్లో ఒక చోటు చూపించినట్లు ‘హైలీ ఇన్‌ఫ్లేమబుల్’ అన్న మాటకు తగ్గట్లే టీజర్ పేలింది.
బాలయ్యది ది బెస్ట్‌గా, ఊర మాస్‌గా చూపిస్తూనే.. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించగలిగాడు అనిల్. ఎలాంటి స్టార్‌ను అయినా అనిల్ డీల్ చేయగలడు అనిపించేలా ఈ టీజర్ ఉంది. బాలయ్య అభిమానులైతే టీజర్ చూశాక మామూలు ఉత్సాహంలో లేరు. అసలే అఖండ, వీరసింహారెడ్డి పెద్ద హిట్లవడంతో బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఇలాంటి ఊపులో సరైన మాస్ మూవీ పడితే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. కాబట్టి దసరాకు అనిల్ మాస్ విందు మరో స్థాయిలో ఉండబోతుందన్నమాటే.
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…