నిన్నట్నుంచి నందమూరి అభిమానుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. అందుకు బాలయ్య పుట్టిన రోజు ఒక్కటే కారణం కాదు. ఆయన వారసుడు మోక్షజ్ఞ తేజ కొత్త ఫొటోలు ఆన్ లైన్లోకి రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతుండగా.. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.
నటనలోకి అడుగు పెట్టడానికి మోక్షజ్ఞనే ఆసక్తి చూపించట్లేదని గుసగుసలు వినిపించాయి. అలాంటి అభిప్రాయం కలగడానికి తన లుక్స్ ప్రధాన కారణం. టీనేజీలో ఫిట్‌గానే కనిపించిన మోక్షజ్ఞ.. తర్వాత షేపవుట్ అయిపోయాడు. ఒక దశలో విపరీతంగా బరువు పెరిగిపోయి.. పొట్టతో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. అతడి వాలకం చూస్తే సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే లేనట్లు కనిపించింది. ఏడాది ముందు కూడా మోక్షజ్ఞ లుక్స్ హీరోకు తగ్గట్లు లేవు.
ఐతే తాజా ఫొటోల్లో మోక్షజ్ఞ సగానికి సగం అయి కనిపిస్తున్నాడు. ఒంట్లో ఎక్స్‌ట్రా ఫ్లష్ అంతా కరిగిపోయింది. ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువుతో, కొంచెం వీక్‌గా కూడా కనిపించాడు మోక్షజ్ఞ. ఇంతలో ఇంత మార్పు చూసి చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. బహుశా అతన జూనియర్ ఎన్టీఆర్ లాగే సర్జరీకి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.
లేదంటే ఒక్కసారిగా ఇంత సన్నబడటం చాాలా కష్టం. తారక్ సైతం సొంతంగా బరువు తగ్గలేక చివరికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. ‘రాఖీ’ సినిమాలో అంత బొద్దుగా కనిపించి.. ‘యమదొంగ’లో రివటలా కనిపించేసరికి జనాలు షాకైపోయారు. ఆ తర్వాత కొంచెం బరువు పెరిగి పర్ఫెక్ట్ షేప్‌లోకి వచ్చాడు. మరి మోక్షజ్ఞ కూడా ఇలా బరువు తగ్గాడంటే అతి త్వరలోనే అతడి అరంగేట్రం ఉంటుందన్నమాటే. తన తొలి సినిమాకు సంబంధించి మరి కొన్ని నెలల్లో ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on June 10, 2023 3:35 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…